రాష్ట్రంలో అరాచకపాలన నడుస్తోంది

రాష్ట్రంలో అరాచకపాలన నడుస్తోంది

పార్టీ సిద్ధాంతాల కోసం ఎందరో కార్యకర్తలు త్యాగాల చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. బీజేపీ పార్టీ అధికారం కోసం కాకుండా.. అభివృద్ధి కోసం పనిచేస్తుందని అన్నారు. రాష్ట్రంలో అరాచక, నియంతృత్వ కుటుంబ పాలన కొనసాగుతుందని బండి సంజయ్ ఆరోపించారు. కరెంట్, ఆర్టీసీ ఛార్జీలు పెంపుతో ప్రజలపై భారం మోపుతున్న కేసీఆర్ సర్కారు.. ఉద్యోగ నోటిఫికేషన్ల పేరుతో యువతను, ధాన్యం సేకరణ విషయంలో రైతులను మోసం చేస్తోందని విమర్శించారు. కేవలం అధికారం కోసం పనిచేసే పార్టీలు దేశంలో ఉండలేవన్న బండి సంజయ్.. రాష్ట్రంలో గడప గడపకు వెళ్లి ప్రజలకు వాస్తవాలు వివరిస్తామని చెప్పారు. 

రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని బండి సంజయ్ స్పష్టం చేశారు. గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నియంత, అరాచక, కుటుంబపాలన్న కొనసాగుతోందన్న ఆయన.. కుటుంబ పాలనను అంతమొందించేందుకు ప్రతి బీజేపీ కార్యకర్త కంకణం కట్టుకోవాలని పిలుపునిచ్చారు.

For more news..

పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన ఎంఐఎం కార్పొరేటర్ అరెస్ట్

ఆడపిల్ల పుట్టిందని సంబురాలు.. హెలికాప్టర్లో ఇంటికి