హంగ్ వస్తే.. ఏ పార్టీకి మద్దతివ్వం : బీజేపీ

హంగ్ వస్తే.. ఏ పార్టీకి మద్దతివ్వం : బీజేపీ

తెలంగాణలో  హంగ్ వస్తే ఏ పార్టీకి మద్దతు ఇవ్వమని బీజేపీ ముఖ్య నేతలు అంటున్నారు. 2023, నవంబర్ 30వ తేదీ  రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో జరిగిన పోలింగ్ లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చే అవకాశం లేదని.. హంగ్ వచ్చే అవకాశమే ఎక్కువగా ఉందని బీజేపీ భావిస్తోంది. ఒకవేళ రాష్ట్రంలో హంగ్ వస్తే ఏ పార్టీకి మద్దతు ఇవ్వకూడదని బీజేపీ పార్టీ అదిష్ఠానం నిర్ణయించినట్లు తెలుస్తోంది.  తమకు 15 నుంచి 20 సీట్లు వస్తాయని బీజేపీ నాయకులు అంచనా వేస్తున్నారు. ఎన్నికల్లో బీజేపీ 111 స్థానాల్లో పోటీ చేసింది.. మిగతా స్థానాలు పోత్తులో భాగంగా జనసేనకు 8 స్థానాలను కేటాయించింది.   రాష్ట్రంలో హంగ్ వస్తే..  రాష్ట్రపతి పాలన ఏర్పడితుందని.. అప్పుడు తమకే అడ్వాంటేజ్ గా ఉంటుందని.. వచ్చే  పార్లమెంటు ఎన్నికలకు ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. 

ఈ మధ్య ఘట్ కేసర్ లో జరిగిన బీజేపీ ఇంటర్నల్ మీటింగ్  లో  బిజేపీ నేషనల్ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రెటరీ బిఎల్ సంతోష్ సైతం రాష్ట్రంలో హాంగ్ వచ్చే అవకాశం ఉందన్నారు.  హాంగ్ వస్తే... ప్రభుత్వం ఏర్పాటు కోసం ఆయా పార్టీలోని ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకునే ఆలోచనలో  బీజేపీ ఉన్నట్లు సమాచారం.  మహారాష్ట్రలో ఏక్ నాథ్ సిండే ఏపిసొడ్ ను  ఆ పార్టీ నేతలు ఇంటర్ననల్ గా గుర్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.  బీఆర్ఎస్ లో కూడా ఏక్ నాథ్ సిండే ఉండొచ్చు కదా అని బీజేపీ నేతలు అంటున్నారు.