
థాయిలాండ్లో ఓ పెద్ద స్కాం బయటపడింది. ఏకంగా బౌద్ధ సన్యాసులనే వల్లో వేసుకొని కోట్లు నొక్కేసింది. సమాచారం ప్రకారం థాయిలాండ్ పోలీసులు బౌద్ధ సన్యాసులను బ్లాక్ మెయిల్ చేస్తున్న ఓ మహిళను అరెస్టు చేశారు. ఈ మహిళ 9 మంది బౌద్ధ సన్యాసులతో లైంగిక సంబంధాలు పెట్టుకోవడమే కాకుండా, ఆమె అశ్లీల వీడియోల ద్వారా వారి నుండి డబ్బు వసూలు చేసింది. మిస్ గోల్ఫ్ పేరుతో చలామణి అవుతున్న ఈ మహిళ గత మూడు సంవత్సరాలలో సుమారు 102 కోట్లు వసూలు చేసిందని థాయ్ పోలీసులు తెలిపారు.
అసలు ఎవరు ఈ మిస్ గోల్ఫ్: మిస్ గోల్ఫ్ ని విలేవన్ అంస్వత్ గా గుర్తించిన పోలీసులు విలేవన్ అంస్వత్ కావాలనే ప్రముఖ బౌద్ధ సన్యాసులను టార్గెట్ చేసుకొని, మొదట వారితో ప్రేమగా సంబంధాన్ని ఏర్పరచుకొని తరువాత వారితో సన్నిహితంగా ఉంటున్నట్లు స్టార్ట్ చేసింది. అలాగే వారితో సాన్నిహిత్యంగా ఉన్న 80 వేల ఫోటోలు, వీడియోలను చూపించి వారిని బ్లాక్ మెయిల్ చేసి భారీ మొత్తంలో డబ్బును వసూలు చేసింది. అయితే జూదానికి బానిస కావడం వల్లే విలేవన్ అంస్వత్ ఎక్కువగా డబ్బు ఖర్చు చేసిందని పోలీసులు తెలిపారు.
ఈ స్కాం ఎలా బయటపడిందంటే : ఒక ప్రముఖ మఠాధిపతి అకస్మాత్తుగా సన్యాసి జీవితాన్ని వదిలేయడంతో లైంగిక వేధింపులు, దోపిడీ బండారం మొత్తం వెలుగులోకి వచ్చింది. విలేవన్ అంస్వత్ ఈ సన్యాసిని కూడా డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేసింది. తాను గర్భవతినని, తనకు బిడ్డ పుట్టబోతుందని, ఈ విషయాన్ని దాచాలంటే 72 లక్షల థాయ్ బాట్ ఇవ్వాలని డిమాండ్ చేసింది.
విల్లెవన్ అంస్వత్ బ్లాక్‌మెయిల్‌తో ఇబ్బంది పడ్డ బౌద్ధ సన్యాసి తన బ్రహ్మచర్యాన్ని వదులుకున్నాడు. దీని తరువాత విషయం తీవ్రమై పోలీసుల దర్యాప్తు వరకు చేరుకుంది. దర్యాప్తులో సుమారు 9 మంది బౌద్ధ సన్యాసులు ఆ మహిళ హనీ ట్రాప్‌లో చిక్కుకున్నారని తేలింది. వారందరినీ సన్యాసి కూడా పదవుల నుండి తొలగించి సన్యాసి సంఘం నుండి బహిష్కరించారు.
ఆలయ అకౌంట్ నుండి కూడా డబ్బు : థాయ్ పోలీసులు విలవన్ అంస్వత్ ను అరెస్టు చేసాక ఆమెపై మనీలాండరింగ్, అక్రమ దోపిడీ, దొంగతనం వంటి ఆరోపణలు మోపాయి. ఆమె అకౌంట్ కూడా పోలీసులు చెక్ చేయగా ఉత్తర థాయిలాండ్‌లోని ఓ ఆలయానికి సంబంధించిన బ్యాంకు అకౌంట్ నుండి ఆమె అకౌంటుకు డబ్బు పంపినట్లు బయటపడింది.
దేశవ్యాప్తంగా ఉన్న సన్యాసులపై దర్యాప్తు : ఈ కేసు చాలా దిగ్భ్రాంతికరమైనదని కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారి తెలిపారు. నిందితురాలు చాలా ప్రమాదకరమైనది. దేశవ్యాప్తంగా ఉన్న బౌద్ధ సన్యాసులను మేము విచారిస్తాము. దీనివల్ల చాలా మార్పులు వస్తాయని మేము నమ్ముతున్నాము. అరెస్టు తర్వాత విలేవన్ అంస్వత్ బౌద్ధ సన్యాసులతో తనకున్న సంబంధాన్ని అంగీకరించిందని అయితే, తాను డబ్బు తీసుకోలేదని, డబ్బు ఇచ్చానని చెప్పినట్లు తెలిపారు. విలవన్ అంస్వత్ మహిళతో తమకు సంబంధం ఉందని పలువురు బౌద్ధ సన్యాసులు అంగీకరించారని మీడియా నివేదికలు వెల్లడించాయి.