
శ్రీశైలం సమీపంలోని ఈగల పెంట, దోమల పెంట పేర్లు మారాయి. ఈగల పెంట, దోమల పెంట గ్రామాల పేర్లు మార్చుతూ ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈగల పెంటను కృష్ణ గిరి, దోమల పెంటను బ్రహ్మగిరిగా మార్చింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల బోర్డులు కొత్త పేర్లతో మార్చాలని అధికారులు ఆదేశించారు.
శ్రీశైలం వెళ్లే మార్గంలో కనిపంచే ఈ గ్రామాలు అక్కడి టూరిస్టులను ఆకర్షిస్తాయి. ఈ పేర్లేంటి వింతగా ఉన్నాయనుకుంటారు అందరూ. నాగర్ కర్నూలు జిల్లాలోని పరిసర ప్రాంతాల్లో ఉన్న ఈ గ్రామాలను తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 చట్టం ప్రకారం దోమలపెంటను బ్రహ్మగిరిగా, ఈగలపెంటను కృష్ణగిరిగా అధికారికంగా ప్రకటించిందని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ తెలిపారు.ప్రభుత్వ కార్యాలయాల్లో పేర్లు మార్చాలని తాను కూడా అన్ని శాఖల అధికారులను ఆదేశించానని చెప్పారు.