
ఏ తల్లి అయినా.. కొడుక్కి ఏం చెబుతుంది.. పద్దతిగా ఉండు.. మంచిగా పని చేసుకుని బతుకు.. గాలి తిరుగుళ్లు తిరగొద్దు.. బాగా చదువుకో అనే కదా.. ఈ తల్లి కూడా అలాగే చెప్పింది కొడుక్కి.. ఆ కొడుకు ఏం చేశాడు మంచి మాటలు చెప్పిన తల్లినే చంపేశాడు.. ఇంతకీ ఈ కొడుకు ఏమైనా పీకుతున్నాడా అంటే అదీ లేదు.. గాలి తిరుగుళ్లు తిరుగుతూ జులాయిగా మారాడు.. ఇటీవల మందు కొట్టటం.. అమ్మాయిలతో తిరగటం కూడా చేస్తున్నాడంట.. ఈ విషయం తెలిసిన తల్లి మందలించింది. అన్నీ బంద్ చేసి మంచిగా ఉండు అని చెప్పింది.. అంతే మనోడికి కోపం వచ్చింది.. తల్లినే చంపేశాడు. ఈ దారుణమైన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి పట్టణంలో జరిగింది.. పూర్తి వివరాల్లోకి వెళితే..
తిరుపతిలో దారుణం: తల్లిని గొంతు నులిమి చంపిన కొడుకు
జులాయిగా తిరుగుతున్నావ్.. ఏదైనా పనిచేసుకోవచ్చుగా అని మందలించినందుకు కొడుకు తల్లిని గొంతు నులిమి చంపిన ఘటన శనివారం (జూలై 19, 2025 )- వెలుగులోకి వచ్చింది. చిత్తూరు జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. తిరుపతిలోని ఓ షోరూమ్‌లో పనిచేస్తున్న శారద (45) అనే మహిళను ఆమె కుమారుడు ధనుష్ కుమార్ (22) మద్యం మత్తులో గొంతు నులిమి చంపినట్లు అలిపిరి ఎస్ఐ తెలిపారు. జులాయిగా తిరుగుతున్న కొడుకుకు పని చేసుకోవాలని తల్లి మందలించడమే ఈ దారుణానికి దారితీసింది.
గురువారం రాత్రి ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఇంటర్ మధ్యలోనే ఆపేసి ఆవారాగా తిరుగుతున్న ధనుష్‌ను తల్లి శారద ఏదైనా పని చేసుకోవాలని, బాధ్యతాయుతంగా బతకాలని కోరింది. అయితే తన తప్పును తెలుసుకోని ధనుష్, తల్లిపై కోపం పెంచుకున్నాడు. అంతేకాకుండా ఆమెపై వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో గొడవకు దిగాడు. ఈ క్రమంలో ధనుష్ కోపంతో శారద ముఖంపై బలంగా కొట్టాడు. దాంతో ఆమె కిందపడిపోగా ధనుష్ ఆమె గొంతు నులిమి చంపేశాడు.
ALSO READ : Sangeeta Bijlani: సంగీత బిజ్లానీ ఫామ్‌హౌస్‌లో దొంగతనం.. లక్షల విలువైన వస్తువులు మాయం!
ఈ దారుణం జరిగిన తర్వాత ధనుష్ శుక్రవారం తన అమ్మమ్మకు ఈ విషయాన్ని తెలియజేశాడు. దాంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి ధనుష్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఏడాది క్రితం ధనుష్ తండ్రి కువైట్‌కు వెళ్లినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు.