HCA జనరల్ బాడీ మీటింగ్..అడ్డుకునేందుకు టీసీజేఏసీ యత్నం.. ఉప్పల్ స్టేడియం దగ్గర ఉద్రిక్తత

HCA జనరల్ బాడీ మీటింగ్..అడ్డుకునేందుకు టీసీజేఏసీ యత్నం.. ఉప్పల్ స్టేడియం దగ్గర ఉద్రిక్తత

హైదరాబాద్: భారీ బందోబస్తు మధ్య ఉప్పల్ స్టేడియంలో  హైదరాబాద్ క్రికెట్ అసోసియేష్ (HCA) జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. శనివారం (జూలై 19)   ఉదయం జరిగిన ఈ సమావేశంలో కొత్త  అంబుడ్స్ మెన్ గా సురేష్ కుమార్, ఎథిక్స్ ఆఫీసర్ గా కేసీ భాను ఎన్నికయ్యారు. ఈ సమావేశానికి 173 క్లబ్బుల కార్యదర్శులు మాత్రమే హాజరయ్యారు. 

ఈ సమావేశానికి గతంలో రద్దయిన 57 క్లబ్బల కార్యదర్శులకు అనుమతి లేదని HCA చెప్పడంతో ఆయా కార్యదర్శులను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. ఉప్పల్ స్టేడియం దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు  చేశారు. రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఆధ్వర్యంలో అనుమతి ఉన్న క్రికెట్ క్లబ్బుల కార్యదర్శులను మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు 

అయితే ఓవైపు మీటింగ్ జరుగుతుండగా అడ్డుకునేందుకు తెలంగాణ క్రికెట్ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. గతంలో రద్దైన 57 క్లబ్ లను జగన్ అధ్యక్షుడు అయ్యాక తిరిగి ఎంట్రీ ఇచ్చాయి. అయితే ఈ క్లబ్బులను ఈ 57 క్లబ్ లను యాక్టింగ్ HCA ప్రెసిడెంట్ దల్జిత్ సస్పెండ్ చేశారు. దీంతో AGM లో పాల్గొనేందుకు వచ్చిన 57 క్లబ్ కార్యదర్శులను లోపలకి రానువకుండా గేట్ దగ్గరే సిబ్బంది అడ్డుకున్నారు. 

రద్దుచేసిన క్లబ్బుల కార్యదర్శులను అనుమతించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ క్రికెట్ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు  ధర్నాకు దిగారు. దీంతో ఉప్పల్ స్టేడియం దగ్గర ఉద్రికత్త నెలకొంది. మాజీ తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. 

ఇటీవల హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో అక్రమాలు జరిగాయని తెలంగాణ క్రికెట్‌ అసోసియేషన్‌ ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన సీఐడీ హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్‌ రావుతోపాటు ట్రెజరర్‌ శ్రీనివాస్ రావు, సీఈఓ సునీల్ కంటే, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ జనరల్ సెక్రటరీ రాజేందర్ యాదవ్, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ అధ్యక్షురాలు కవితలను సీఐడీ అరెస్టు చేసింది. ఈ క్రమంలో జగన్మోహన్‌ రావుతోపాటు  నిందితులకు మల్కాజిగిరీ కోర్టు పన్నెండు రోజుల రిమాండ్‌ విధించింది.

ఇక ఈ అక్రమాల కేసులో రాజకీయ నాయకుల ప్రమేయంపై కూడా విచారణ జరపాలని తెలంగాణ క్రికెట్‌ అసోసియేషన్‌ ఇటీవల మరోసారి సీఐడీకి ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత పేర్లను సీఐడీకి ఇచ్చిన ఫిర్యాదులో టీసీఏ ప్రస్తావించడం గమనార్హం. బీసీసీఐ నుంచి వచ్చే నిధులను మళ్లించారంటూ టీసీఏ ఆరోపించింది.