Vastu Tips: ఇంట్లో వాటర్ సంప్.. ఇంకుడు గుంత ఎక్కడ ఉండాలో తెలుసా..!

Vastu Tips:  ఇంట్లో   వాటర్ సంప్.. ఇంకుడు గుంత ఎక్కడ ఉండాలో తెలుసా..!

ఇల్లు కట్టేటప్పుడు దాదాపు అందరు కచ్చితంగా వాస్తు సిద్దాంతిని చూపిస్తాం.  గతంలో వాస్తు ప్రకారం  ఉన్నా... ప్రస్తుతం వాటర్​ సంప్​ నిర్మించుకోవాలంటే వాస్తు ప్రకారం నిర్మించుకోవాలి.  అలాగే ఇంకుడు గుంత తవ్వినా కాని వాస్తు ప్రకారమే ఉండాలి.  ఇంట్లో వాటర్​ సంప్​ నిర్మాణానికి.. ఇంకుడు గుంతకు సంబంధించిన వాస్తు వివరాల గురించి కన్సల్టెంట్​ కాశీనాథుని శ్రీనివాస్​ ఏమంటున్నారో తెలుసుకుందాం. . . 

ప్రశ్న : మా ఇంటికి తూర్పున మెయిన్ గేట్ ఉంది. ఉత్తర ఈశాన్యంలో వాటర్ సంపు కట్టుకున్నాం. ఇంటి పైన వాటర్ ట్యాంక్ తూర్పు ఆగ్నేయంలో పెట్టుకున్నాం.. అలా ఉండొచ్చా? వాస్తు ప్రకారం ఇంటిపైన వాటర్ ట్యాంక్ ఏ దిక్కుల్లో ఉండాలి..

జవాబు: మీరు ఏర్పాటు చేసుకున్న మెయిన్ గేట్, వాటర్ సంపు వాస్తు ప్రకారం ఉన్నాయి. వాటర్ ట్యాంక్ తూర్పు ఆగ్నేయంలో పెట్టుకోవడం పల్ల ఎలాంటి సమస్యలు రావు. వాస్తుప్రకారం కరెక్టే .. ఉత్తర వాయువ్యంలో లేదా పడమట వాయువ్యంలో అయినా వాటర్ ట్యాంక్ పెట్టుకోవచ్చు... వాస్తు పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని వాస్తు కన్సల్టెంట్​ శ్రీనివాస్​ చెబుతున్నారు. 

ALSO READ : Vastu Tips : మీరు షాపు, ఆఫీసు తీసుకుంటున్నారా.. ఈ వాస్తు టిప్స్ పాటిస్తే మంచి లాభాలు ఉంటాయి..!

ఇంకుడుగుంత ఎక్కడ తవ్వాలి?

ప్రశ్న :  మా ఇంటికి ఉత్తరంవైపు మెయిన్ డోర్ ఉంది. వాస్తుప్రకారం ఇంకుడుగుంత ఏ వైపు తవ్వుకోమంటారు?

జవాబు:ఇంకుడుగుంత ఇంటికి తూర్పు ఈశాన్యంలో ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. కుదరకపోతే ఉత్తర ఈశాన్యంలో అయినా పరవాలేదు. ఇతర దిక్కుల్లో ఇంకుడుగుంతలు కట్టకూడదు. గ్రౌండ్ లెవల్ కంటే ఇంకుడుగుంత తక్కువ ఎత్తులో ఉండాలని వాస్తు కన్పల్టెంట్​ శ్రీనివాస్​ అంటున్నారు. . .