Vastu Tips : మీరు షాపు, ఆఫీసు తీసుకుంటున్నారా.. ఈ వాస్తు టిప్స్ పాటిస్తే మంచి లాభాలు ఉంటాయి..!

Vastu Tips : మీరు షాపు, ఆఫీసు తీసుకుంటున్నారా.. ఈ వాస్తు టిప్స్ పాటిస్తే మంచి లాభాలు ఉంటాయి..!

చాలామందికి  ఎంత కష్టపడి పని చేస్తున్నా వ్యాపారంలో అనుకున్న ఫలితం రాదు.. బిజినెస్​ సరిగా సాగక.. అప్పులు... ఆర్థిక కష్టాలు .. కుటుంబ సమస్యలు పెరుగుతాయి.  అలాంటి వ్యాపారస్తులు కొన్ని వాస్తు టిప్స్​ పాటిస్తే  బిజినెస్​ కష్టాలు తీరుతాయని పండితులు అంటున్నారు. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. . 

 వ్యాపారంలో విజయం సాధించడానికి వాస్తు పండితులు తెలిపిన వివరాల ప్రకారం కొన్ని టిప్స్​ పాటించాలి. పంచ భూతాల సమతుల్యత కూడా వ్యాపారాభివృద్ధికి దోహదం చేస్తాయి.  అంతా బాగున్నా.. వ్యాపారం సక్రమంగాలేకపోతే  వాస్తు సిద్దాంతం ప్రకారం తీసుకోవలసిన చర్యలను చూద్దాం. . 

ఉత్తర దిశ: ఈ దిశ కుబేరుని స్థానం . ఎప్పుడూ స్పష్టంగా ఉండేలా చూసుకోండి. ఈ దిశలో  అగ్ని సంబంధమైన వస్తువులుల ఉంచకూడదు. అంటే నూనె.. నెయ్యి.. కర్పూరం.. అగర్​ బత్తీలు వంటివి నార్త్​ సైడ్​  ఉంచకూడదు. ఈ ప్రాంతంలో ఎర్రగా ఉండే వస్తువులు పెట్టకూడదు.  ఎర్ర రంగు కూడా వేయకూడదు.  ఈ ప్రాంతం గది మాదిరిగా కాకుండా ఓపెన్​ గా ఉండాలి.  ఈ ప్రాంతంలో ఆకుపచ్చ రంగు ఉన్న వస్తువులను ఉంచండి.  వ్యాపార లాభాలను బుధుడు కలుగజేస్తాడు.  బుధుడికి పచ్చ అంటే చాలా ఇష్టం.  ఇలా చేయడం వలన వ్యాపారం అభివృద్ది చెందుతుంది. 

ALSO READ : జ్యోతిష్యం: దంపతుల మధ్య గొడవలు ఎందుకు వస్తాయి... పరిష్కార మార్గాలు ఇవే..!

వాస్తు యంత్రం:  కొంతమందికి.. అప్పటి వరకు బాగా సాగిన వ్యాపారం ఒక్కసారిగా కుదేలవుతుంది. నరఘోష పట్టినప్పుడు వెంటనే బిజినెస్​ తగ్గిపోతుంది.  రావలసిన బకాయిలు రావు.  అప్పుడు నరఘోష యంత్రంతో పాటు.. ఆకర్షణ యంత్రాన్ని షాపులో  పెట్టుకోవాలి. షాపులో దేవుడి పటాలు పెట్టే స్థలంలో ఉంచి ఇవి కూడా ఉంచి .. రోజూ ఉదయం ..సాయంత్రం రెండు అగర్​బత్తీలు వెలించి.. హారతి ఇవ్వండి.  అయితే దేవుడి విగ్రహాలను ఎక్కడ బడితే అక్కడ ఉంచినట్లయితే.. అది మీ పని, లాభాలపై ప్రతికూల ప్రభావాలను చూపిస్తాయి. వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం దేవుడి పటాలు షాపులో  ఈశాన్య దిక్కులో కాని  తూర్పు దిశలో ఉండాలి.

ఆఫీసు ప్రవేశ ద్వారం :    దుకాణం  ప్రవేశద్వారాన్ని రకరకాల అలంకార వస్తువులతో అలంకరించకూడదు.  వాస్తు నిపుణుడి ప్రకారం ఇది చేయకూడదట.. ఇలా రకరకాల వస్తువులతో అలంకరణ కొన్ని సార్లు వ్యాపార అవకాశాలను అడ్డుకుంటుందట. కనుక ఇలా ఏర్పాటు చేసిన అలంకారాలను వెంటనే తొలగించండి. మీ కార్యాలయం, దుకాణం  ప్రవేశ ద్వారం ఎల్లప్పుడూ క్లియర్ గా ఉండాలి. మరో ముఖ్య విషయం ఏంటంటే ప్రధాన ద్వారం వాయువ్య దిశలో ఉండాలి.  లేదంటే ఈశాన్య, ఉత్తరం దిక్కుల్లో కూడా ఉండవచ్చు.  ఏ దిక్కులో ప్రధాన ద్వారం ఉన్నా.. క్యాష్​ కౌంటర్​ మాత్రం ఉత్తర దిక్కులో ఉండాలి. 

గోడలకు రంగులు : షాపునకు  వేసే గోడ రంగులు కూడా ముఖ్యమైనవి. అవి పని వాతావరణంతో నేరుగా సంబంధం కలిగి ఉంటాయి. ఎల్లప్పుడూ ప్రకాశవంతంగా, కంటికి ఆహ్లాదకరంగా ఉండే రంగులను ఉపయోగించండి. షాపులో  తెలుపు, నీలం, బూడిద, క్రీమ్​  వంటి  లేత రంగులను ఎంచుకోండి. ఇది సానుకూలతను తెస్తుంది. వ్యాపారంలో అభివృద్ధి జరిగేలా చూస్తుంది.

షాపు యజమాని సీటు :  షాప్‌లో  యజమాని కూర్చునే  ప్రదేశం ..  వ్యాపార విజయంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.  షాపు యజమాని  నైరుతి దిశలో .. ముఖం ఉత్తరం వైపు ఉండేలా కూర్చోవాలి. పూజ గది లేదా దేవుడి ఫోటోలు, విగ్రహాలు మీ వెనుక ఉండకూడదు. మీ సీటు వెనుక దేవుని విగ్రహాలను ఎప్పుడూ ఉంచవద్దు. మీ సీటు వెనుక ఎల్లప్పుడూ సాదా గోడ ఉండాలి.

శ్వేతార్క్ గణపతి: షాపులో శ్వేతార్క గణపతి చిత్ర పటాన్ని ప్రతిష్టించండి.  రోజు అగర్​ బత్తీల ధూపాన్ని చూపించండి.  అలాగే వారానికి ఒక సారి కొబ్బరికాయ కొట్టి పసుపు రంగు స్వీట్లను నైవేద్యం పెట్టి.. ఫాపులోని వర్కర్లకు... కస్టమర్లకు పంచండి. 

మెటల్ తాబేలు : వ్యాపారస్తులు కూర్చునే కుర్చీ ఎదురుగా ఉండే టేబుల్​ పై మెటల్​ తాబేలును ఉంచండి.  ఇది కష్టమర్లను ఆకర్షిస్తుందని వాస్తు పండితులు చెబుతున్నారు.  ఇలా చేయడం వలన ఆగిపోయిన బకాయిలు వెంటనే వసూలవుతాయి.  షాపునకు కష్టమర్ల తాకిడి పెరుగుతుందని వాస్తు పండితులు చెబుతున్నారు.