జ్యోతిష్యం: దంపతుల మధ్య గొడవలు ఎందుకు వస్తాయి... పరిష్కార మార్గాలు ఇవే..!

జ్యోతిష్యం:  దంపతుల మధ్య గొడవలు ఎందుకు వస్తాయి... పరిష్కార మార్గాలు ఇవే..!

నేటి సమాజంలో దంపతుల మధ్య గొడవలు.. అపార్దాలు.. ఎక్కువయ్యాయి.   చిన్న విషయంలో ఎవరే రాజీ పడకపోవడం.. పెద్దలు చెప్పినా వినకపోవడం.. సంసారాలను నాశనం చేసుకుంటున్నారు.అలా వారు మంకు పట్టు పట్టి మనశ్శాంతి లేకుండా ఉండటానికి వారి వ్యక్తిగత జాతకమే కారణం అంటున్నారు జ్యోతిష్య నిపుణులు.  తరుచుగొడవలు పడే దంపతుల జాతకాలు ఎలా ఉంటాయి.. వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటి.. జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్న సలహాలను ఒకసారి తెలుసుకుందాం..!

 లగ్నంలో రాహువు... సప్తమంలో  కేతువు ఉన్నవారు వివాహం చేసుకున్నప్పుడు..  వీళ్ళు జీవిత భాగస్వాములను అర్దం చేసుకోవడంలో  విభేదాలు ఏర్పడతాయి. అలాగే  సప్తమ స్థానంలో శని భగవానుడు  ఉన్న వారు తమ జీవితభాగస్వామిని అర్దం చేసుకోరని.. దీనివలన కుటుంబ జీవితంలో  అనేక సమస్యలు ఏర్పడతాయి. కష్టపడి డబ్బు సంపాదించాలనే కోరిక తప్ప ... జీవిత భాగస్వామిని సంతోషంగా ఉంచాలి అనే ఆలోచన వీరికి రాదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

 సప్తమ స్థానంలో కుజుడు ఉంటే జీవిత భాగస్వామి ..  మీపై పెత్తనం చెలాయించి మిమ్మలను అణిచివేసే విధంగా ఉంటుంది. సప్తమ స్థానంలో రాహువు ఉంటే ... అవసరంలేని.. మీకు సంబంధం లేని..  ఊరిలోఉన్న సమస్యలన్నీ ఇంటికి తీసుకువచ్చి కుటుంబంలో మనశ్శాంతి లేకుండా చేసే జీవిత భాగస్వామి వస్తారు. ఇటువంటి జాతకులు ఆలస్యంగా వివాహం చేసుకోవడం మంచిది. 

ALSO READ : కామికా ఏకాదశి ఎప్పుడు.. ఆరోజున చదవాల్సిన మంత్రం.. పూజా విధానం ఇదే..!

వివాహ సమయంలో యోగ దశ నడుస్తుందా ...  పాపగ్రహ దశ నడుస్తుందా అనే విషయంపై ఆధారపడి  ఫలితాలు వస్తాయి. ఆలస్య వివాహం కూడా కొంతమందికి జీవితంలో సక్సెస్ ఇస్తుంది . సప్తమాధిపతి నీచబడిన,  పాపగ్రహాలతో కలిసిన  జాతకులు ఆలస్య వివాహం చేసుకున్నప్పటికీ వివాహంలో సమస్యలు రావు. కర్మానుసారం ఏ విధంగా రాసి పెడితే ఆ విధంగా జరుగుతుంది అని అనుకున్నప్పటికీ ఏ సమయంలో ఏమి చేయాలి అనేది పండితుల ద్వారా  తెలుసుకుని పని చేస్తే  ఫలితాలు అనుకూలంగా మారతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.