కామికా ఏకాదశి ఎప్పుడు.. ఆరోజున చదవాల్సిన మంత్రం.. పూజా విధానం ఇదే..!

కామికా ఏకాదశి  ఎప్పుడు.. ఆరోజున చదవాల్సిన మంత్రం.. పూజా విధానం ఇదే..!

పురాణాల ప్రకారం... చాతుర్మాస కాలంలో శ్రీ మహా విష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడు. ఈ కాలంలో విష్ణుమూర్తిని తులసీ దళాలతో ప్రత్యేక పూజలు చేయడంతో పాటు దానధర్మాలు చేయాలని పండితులు చెబుతారు. ఈ ఏడాది (2025) కామిక ఏకాదశి ఎప్పుడొచ్చింది.. శుభ ముహుర్తం, పూజా విధానం ప్రాముఖ్యతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

ప్రతి ఏకాదశికి  ప్రత్యేక ప్రాముఖ్యత, ప్రయోజనం ఉంటుంది.విష్ణుమూర్తి అనుగ్రహం, దైవానుగ్రహం కోసం భక్తులు ఈ నిర్దిష్ట రోజులలో ఉపవాసం ఉంటారు.ఆషాఢమాసం  కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశి ( జులై21)ని కామికా ఏకాదశి అంటారు.  ఈ పర్వదినాన శ్రీ  లక్ష్మీనారాయణులకు  ప్రత్యేక పూజలు చేయాలని పండితులు చెబుతున్నారు.

వేద పంచాంగం ప్రకారం ఏకాదశి తిథి జూలై 20న మధ్యాహ్నం 12:12 గంటలకు ప్రారంభమై జూలై 21న ఉదయం 9:38 గంటలకు ముగుస్తుంది.  దీనితో కామిక ఏకాదశిని జూలై 21న జరుపుకోవాలని ఉందని చెబుతున్నారు. జూలై 22న ఉదయం 5:37 నుంచి 7:05 గంటల మధ్య తమ ఉపవాసాన్ని విరమించాలని పంండితులు అంటున్నారు

కామికా ఏకాదశి  ( జులై21) నాడు ఉపవాసం ఉంటే పాపాలు నశించడమే కాకుండా...  కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి.  ఆ రోజు  విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల ముక్కోటి దేవతలను పూజించిన ఫలితాలొస్తాయని పండితులు చెబుతారు. అంతేకాదు లక్ష్మీనారాయణును పూజిస్తే పాప కర్మలు తొలగుతాయని పండితులు చెబుతున్నారు. 

ALSO READ : ఆధ్యాత్మికం : మీకు డబ్బులు బాగా రావాలంటే లక్ష్మీదేవిని ఈ విధంగా పూజించాలి.. ఈ మంత్రం పఠించాలి.. ఈ నియమాలు పాటించాలి..?

 కామిక ఏకాదశి చేయడం వల్ల అశ్వమేధ యాగానికి సమానమైన పుణ్యం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి. విష్ణువు పాదాలనుతాకడం వల్ల  మంచిజరుగుతుంది.కామికా ఏకాదశి వ్రతాన్ని చేసే భక్తులు...ఓం నమో భగవతే వాసుదేవాయ నమ: అని జపిస్తూ ఉండాలి.

ఎలా పూజ చేయాలంటే..!

  •  కామికా ఏకాదశి రోజున సూర్యోదయం కంటే ముందు నిద్ర లేచి తలస్నానం చేయాలి.
  • ఉతికిన బట్టలు వేసుకుని, ఇంట్లో పూజా గదిని శుభ్రమైన నీటితో శుభ్రం చేయాలి.
  • ఒక ఎర్రని వస్త్రంపై బియ్యంపై విష్ణుమూర్తి ఫోటో లేదా విగ్రహాన్ని ప్రతిష్టించాలి.
  • శ్రీహరికి పువ్వులు,  తులసిదళాలను  సమర్పించాలి.
  • పంచామృతం...  గంగాజలంతో స్వామివారికి అభిషేకం చేయాలి.
  •  స్వామికి పసుపు, చందనం, పసుపు రంగు పువ్వులు సమర్పించాలి. 
  • ఆవు  నెయ్యితో  దీపారాధన చేసి, కామికా ఏకాదశి వ్రతం కథ, మంత్రాలను చదవాలి.
  •  చివరగా హారతి ఇచ్చి పూజను ముగించాలి.
  •  ఈరోజంతా ఉపవాసం ఉండాలి. మరుసటిరోజు ఉపవాసాన్ని విరమించాలి.
  •   ద్వాదశి రోజు బ్రాహ్మణుడికి దక్షిణ.. స్వయంపాకం ఇవ్వాలి. ఆ తరువాతే ఉపవాస దీక్షను విరమించాలి.

 కామిక ఏకాదశి రోజున శ్రీహరిని పూజించడం వల్ల  పూర్వీకులు సంతోషిస్తారని, వారి అనుగ్రహం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. పూర్వీకుల ఆశీస్సులు పొందిన వ్యక్తి జీవితంలో సంపద, ఆనందం, శ్రేయస్సు కచ్చితంగా పొందుతారు. ఈ పవిత్రమైన రోజున పసుపు రంగు వస్తువులను దానం చేయడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. అందుకే ఈరోజున మీ సామర్థ్యం మేరకు దానధర్మాలు చేయాలి.