ఆధ్యాత్మికం : మీకు డబ్బులు బాగా రావాలంటే లక్ష్మీదేవిని ఈ విధంగా పూజించాలి.. ఈ మంత్రం పఠించాలి.. ఈ నియమాలు పాటించాలి..?

ఆధ్యాత్మికం : మీకు డబ్బులు బాగా రావాలంటే లక్ష్మీదేవిని ఈ విధంగా పూజించాలి.. ఈ మంత్రం పఠించాలి.. ఈ నియమాలు పాటించాలి..?

హిందువులు ప్రతి శుక్రవారం  లక్ష్మీదేవిని కొలుస్తారు.  ఆరోజు లక్ష్మీ దేవిని ఆరాధిస్తే ఐశ్వర్యం.. డబ్బు వస్తుందని నమ్ముతారు.  అయితే లక్ష్మీదేవిని పూజించడానికి కొన్ని నియమాలతో ప్రత్యేక మంత్రాలు ఉన్నాయని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.  ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. . .!

మహాలక్ష్మీ దేవిని పూజస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి.  లక్ష్మీదేవి అమ్మవారి కరుణ.. కటాక్షం ఉంటే  ఆ ఇల్లు కాసులతో కళకళలాడుతుంది.  ఇక లక్ష్మీదేవి ప్రసన్నురాలైతే  వారి జీవితంలో ఆనందానికి .. శ్రేయస్సుకు లోటు ఉండదు.  లక్ష్మీదేవిని పూజించేవారు ఉదయం అంతా ఉపవాసం.. సాయంత్రం పూజ చేయాలని పండితులు అంటున్నారు. 

ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు 21 శుక్రవారాలు ఉపవాసం ఉండి... లక్ష్మీదేవిని పూజిస్తే ఇబ్బందులు తొలగుతాయని ఆధ్యాత్మిక గ్రంథాల ద్వారా తెలుస్తుంది.  ఆరోజు  తెల్లవారుజామునే నిద్రలేచి శుభ్రమైన బట్టలు ధరించి... లక్ష్మీదేవిని పూజించాలి.  

  • అమ్మవారిని ప్రతిష్ఠించే ఆసనాన్ని (పీట) గంగా జలముతో శుద్ది చేయాలి.  ఆ స్థలాన్ని గోమయంతో అలకాలి. 
  • పీటను పసుపు.. కుంకుమతో అలంకారం చేయాలి. ఆసనంపై   ఎర్రటి వస్త్రాన్ని పరిచి .. లక్ష్మీదేవి విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని ఉంచాలి.  
  •  లక్ష్మీదేవి ఎదుట ఆవు నెయ్యి దీపం వెలిగించాలి
  • అమ్మవారి పూజకు తెలుపు లేదా.. ఎరుపురంగు పూలను ఉపయోగించాలి.   
  • లక్ష్మీదేవికి పువ్వులు...  బియ్యం గింజలు ... తామర గింజలు సమర్పించాలి.  ఇవి కూడా లక్ష్మీదేవికి చాలా ప్రియమైనవి.
  • లక్ష్మీదేవిని పూజించే రోజు పగలంతా ఉపవాసం ఉండాలి. సాయంత్రం  మళ్లీ పూజ చేయాలి. 
  • మనస్సు ..  శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి .
  •  చెడు ఆలోచనలు మనస్సులోకి రాకుండా నిరోధించాలి.
  • మద్యం.. మాంసం.. ధూమపానం చేయకూడదు. 
  • తరువాత పాలు.. పాయసం నైవేద్యం సమర్పించాలి.
  • చివరిగా హారతి ఇచ్చి పూజను ముగించాలి.
  • బ్రహ్మచర్యాన్ని పాటించాలి. 

108 సార్లు జపించాల్సిన మంత్రం ఇదే..!

క్షీరోదార్ణవసమ్భూతా లక్ష్మీశ్చంద్ర సహోదరా
వ్రతోననేత్ సంతానా భవతాద్విష్ణుబల్లాభా ।
ఓం హ్రీం శ్రీం క్రీం క్లీం శ్రీ లక్ష్మీ మామ్ గృహే ధన్ పుర్యే, ధన్ పుర్యే, చింత దూరయే-దూరయే స్వాహా:
ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ మహాలక్ష్మి నమః
ఓం మహాలక్ష్మ్యై నమో నమః
ఓం శ్రీం హ్రీం శ్రీం కమ్లే కమలాలయే ప్రసిద్ధయే  శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మ్యై నమః

►ALSO READ | జ్యోతిష్యం: పెళ్లికాని ప్రసాదుల్లా ఎందుకు మిగిలిపోతున్నారు.. వారు ఎలాంటి పరిహారం చేయాలి..