జ్యోతిష్యం: పెళ్లికాని ప్రసాదుల్లా ఎందుకు మిగిలిపోతున్నారు.. వారు ఎలాంటి పరిహారం చేయాలి..

జ్యోతిష్యం: పెళ్లికాని ప్రసాదుల్లా ఎందుకు మిగిలిపోతున్నారు.. వారు ఎలాంటి పరిహారం చేయాలి..

నూరు అబద్దాలు ఆడి పెళ్లి చేయాలంటారు.. ఇది సామెత.. నూరు కాకపోయినా.. చిన్న అబద్దం కూడా ఆడందే పెళ్లికాదు.. ఇది మనందరకు తెలిసిన సత్యమే.  నూరు కాదు  కోటి అబద్దాలు ఆడినా చాలామంది పెళ్లికాని ప్రసాదుల మాదిరిగానే మిగిలిపోతున్నారు.  అలాంటి వారు కయనీయం.. కళ్యాణం చేయాల్సిన పరిహారాలు ఏంటి .. ఈ విషయంపై జ్యోతిష్య పండితులు ఏమంటున్నారు.. వారి జాతకం ఎలా ఉంటుంది.. ఎందుకు పెళ్లి కావడం లేదు.. మొదలగు విషయాలను ఈ స్టోరీలో  తెలుసుకుందాం. . .! 

జ్యోతిష్య శాస్త్రం  మానవుల భవిష్యత్​ను నిర్ధేశిస్తుంది.  కొంతమందికి  జాతకరీత్యా వివాహం ఎవరికి ఆలస్యం అవుతుంది అనే విషయం చాలా సార్లు చర్చించడం జరిగింది. పాప గ్రహాలైన రాహువు ...కేతువు... కుజుడు  ..శని భగవానుడు గ్రహాల కారణంగా వివాహం ఆలస్యం అవుతుంది. 

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం... రాహువు... కేతువు చాయాగ్రహాలు.   కుజుడు...  శని భగవానుడు యుద్ధ గ్రహాలు. ఈ గ్రహాలు కుటుంబ స్థానంలో కానీ ...వివాహ స్థానంలో కానీ ఉన్నవారి వివాహానికి అడ్డంకులు ఏర్పడుతాయి. ఆ గ్రహాల ప్రభావం తీవ్రంగా  ఉన్న వారికి వివాహం జరిగే అవకాశాలు తక్కువుగా ఉంటాయని జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుస్తుంది.  

 సాధారణంగా శని భగవానుడుకు గాని  ... కుజుడుకు గాని...   కుటుంబ స్థానానికి ...  వివాహ స్థానానికి మధ్య  సంబంధం ఏర్పడితే వివాహ దశ   ప్రారంభ సమయంలో  అంటే 20  నుంచి 25 సంవత్సరాల మధ్య ఒక అవకాశం ఇస్తారు. పండితులు తెలిపిన వివరాల ప్రకారం అమ్మాయిలకు అయితే 19 సంవత్సరాల వయసు నుండి 23 సంవత్సరాల వయసు వరకు .. అదే అబ్బాయిలకు అయితే 25 సంవత్సరం వయసు వరకు వివాహపరంగా మంచి అవకాశాలు వస్తాయి. 

ALSO READ : ఆధ్యాత్మికం: జులై 16 నుంచి దక్షిణాయనం.. పితృ దేవతలను ఇలా స్వర్గానికి పంపండి..!

కానీ చాలామంది మంచి ఉద్యోగం రావాలి ... లేదా  జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి .. ఆ తరువాత వివాహం చేసుకుంటాను అనే ఉద్దేశంతో వివాహ అవకాశాలను వదులుకుంటారు.  అలా చేసే వారికి వివాహ విషయంలో ఆటంకాలు ఏర్పడుతాయి.
  
శని భగవానుడు... కుజుడు... రాహువు... కేతువు ...కుటుంబ లేదా వివాహ స్థానానికి సంబంధం ఏర్పడినప్పుడు...  ఇటువంటి జాతకులు తక్కువ వయసులోనే వివాహం చేసుకోవడం చాలా మంచిదని పండితులు చెబుతుంటారు. ఇలాంటి జాతకం ఉన్న వారు అవకాశం వచ్చినప్పుడు...  వివాహం ఆలస్యం చేస్తే  32 సంవత్సరాల వయసు వచ్చేవరకు వివాహం జరగడం చాలా కష్టం అవుతుంది. కొన్ని సందర్భాల్లోఅ  వివాహం జరగడం కూడా కష్టమని పండితులు చెబుతుంటారు. ఒకవేళ వివాహం జరిగినా  వీరు ఊహించిన దానికి భిన్నంగా జీవిత భాగస్వామి ఆలోచనలు ఉంటాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. . .  

  • ఆది దంపతులు  శివపార్వతులను పూజిస్తే జాతకంలో వివాహ సంబంధమైన దోషాలు తొలగుతాయని పండితులు చెబుతున్నారు. పెళ్లి వయస్సు దాటి.. వివాహం నిశ్చయం కావడంలో ఆటంకాలు ఏర్పడితే అలాంటి వారికి శివ పార్వతులను పూజిస్తే వచ్చే పెళ్లిళ్ల సీజన్​ కు పెళ్లి అయ్యే అవకాశాలు ఏర్పడే అవకాశం ఉంది.  ఇంకా కుటుంబంలోని చిన్నారుతో కలిసి శివాలయానికి వెళ్లి  శివపార్వతులను పూజించాలి. ఇంకా మాస శివరాత్రి రోజున లయకారుడైన పరమేశ్వరునికి రుద్రాభిషేకం చేయాలి. మహిళలు శివపార్వతులకు పూజ చేసి  రాగి పాత్రలో నీటిని నింపి..  రాత్రి వేళలో మహావిష్ణువు ఫోటో లేదా ప్రతిమ ముందు ఉంచాలి. 
     
  • పెళ్లి జరగడంలో ఆలస్యం అవుతుంటే ఈ పరిహారం పాటిస్తే తప్పక వివాహం జరుగుతుందని పండితులు అంటున్నారు.  ఆరు ముఖాలు ఉండే రుద్రాక్షను ధరించడం వల్ల వివాహ దోషం తగ్గిపోయి త్వరలోనే పెళ్లి అవుతుంది. ఆరు ముఖాల రుద్రాక్షను కార్తీకేయుని రూపంగా చూస్తారు. 
     
  • గురువారం రోజున శ్రీ మహావిష్ణువును పూజిస్తే శుభ ఫలితాలు వస్తాయి. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండాలి. అలాగే అరటి చెట్టును పూజించాలి. గురువారం రోజు పసుపును దానం చేయాలి. బియ్యం పిండిలో బెల్లం, పసుపు, శనగపిండి కలిపి గోవులకు ఆహారంగా తినిపించాలి. ఈ రోజు గురు మంత్రాన్ని 108 సార్లు జపించాలి.
     

 పెళ్లి వేడుక జరగక ఇబ్బంది పడే పురుషులు ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి ప్రత్యేక పూజలు చేయాలి. స్వామి వారికి సింధూరం సమర్పించాలి. ఇలా కొన్ని మంగళవారాలు చేయడం వల్ల వివాహానికి సంబంధించిన కష్టాలన్నీ తొలగిపోతాయి.  

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనంలోని వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించేదు. మీకున్న వాస్తు, జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.