వచ్చే సోమవారం.. 21వ తేదీన బ్యాంకులు, స్కూల్స్, వైన్ షాపులు అన్నీ బంద్!

వచ్చే సోమవారం.. 21వ తేదీన బ్యాంకులు, స్కూల్స్, వైన్ షాపులు అన్నీ బంద్!

Monday Holiday: రానున్న సోమవారం స్కూళ్ల నుంచి బ్యాంకుల వరకు అన్నీ క్లోజ్ కానున్నాయి. అయితే తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు దీనికి సంబంధించిన వివరాల గురించి తప్పక తెలుసుకోవాలి. 

తెలంగాణ ప్రభుత్వం సెలవుల క్యాలెండర్ ప్రకారం హైదరాబాద్, సికిందరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ప్రభుత్, ప్రైవేటు స్కూళ్లకు సోమవారం సెలవుదిన. బోనాల పండుగ సందర్భంగా జూలై 21న అధికారిక సెలవును రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. లక్షలాది మంది ప్రజలు సాంప్రదాయ వేషధారణలో అనేక దశాబ్ధాలుగా జరుపుకుంటున్న పండుగ కారణంగా ప్రత్యేక సెలవును ప్రభుత్వం అందిస్తోంది. తెలంగాణ సంస్కృతిలో బోనాల పండుగకు ఉన్న ప్రాముఖ్యత కారణంగా సెలవు ప్రకటించబడింది. 

ALSO READ : లాల్దర్వాజ బోనాలకు స్పెషల్ బస్సులు

హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో జరిగే శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర సందర్భంగా వైన్ షాపులు, బార్లను జూలై 20, 21న మూసివేయాలని తెలంగాణ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో జూలై 20న ఉదయం 6 గంటల నుంచి జూలై 22 ఉదయం 6 గంటల వరకు తెలంగాణలో మద్యం విక్రయాలను నిలిపివేశారు. ప్రజలు ప్రశాంతంగా బోనాలు జరుపుకునేందుకు వీలుగా ఎలాంటి అవాంఛిత ఘటనలు జరగకుండా నివారించే క్రమంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడైంది. అయితే వైన్స్ బంద్ కేవలం హైదరాబాద్ నగరంలో మాత్రమేనని మెుత్తం రాష్ట్రం అంతగా కాదని గమనించాలి ప్రజలు.

రాష్ట్ర వ్యాప్తంగా సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ప్రజలు బోనాలు జరుపుకుంటారు. అందుకే జూలై 21న అంటే సోమవారం తెలంగాణ వ్యాప్తంగా బ్యాంకులకు సెలవుగా రిజర్వు బ్యాంక్ సెలవుల క్యాలెండర్ సూచిస్తోంది. ఆర్బీఐ దేశంలోని వివిధ రాష్ట్రాలు ప్రాంతాల్లో ఉండే స్థానిక పండుగలకు అనుగుణంగా సెలవులను ప్రకటిస్తూనే ఉంటుందని మనందరికీ తెలిసిందే.. ఈ క్రమంలోనే సోమవారం తెలంగాణలో బ్యాంకులు క్లోజ్ కానున్నాయి.