
ధార్: పాకిస్తాన్ అణు బెదిరింపులకు భయపడబోమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 'ఇది నవ్య భారతదేశం.. ఎవరి అణు బెదిరింపులకు భయపడదు... తిరిగి ఎదురు దాడి చేస్తుంది' అని వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్ లోని ధార్ లో ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొన్నారు. ప్రధాని సరేంద్ర మోదీ తన 75వ పుట్టినరోజు సందర్భంగా ధార్లో పలు కార్యక్రమాల్లో మా ట్లాడారు.
"నిన్నే ప్రపంచం పాకిస్తానీ ఉగ్రవాది తన దుస్థితి చెబుతూ రోదించడం చూసింది. ఇదే కొత్త భారత్.. ఎవరి అణు బెదిరింపులకూ భయ పడని దేశం. ఇది శత్రువును వారి ఇంట్లోకే వెళ్లి మట్టుపెట్టే భారత్.' అని ప్రధాని అన్నారు. ఆపరేషన్ 'సింధూర్' ద్వారా ఉగ్ర శిబిరాలను ఎలా నాశనం చేశామో ప్రధాని గుర్తు చేశారు. మన సైన్యం క్షణాల్లోనే పాకిస్తాన్ను మోకాళ్లపై కూ ర్చోబెట్టిందని అన్నారు. తాము అణు బెదిరింపు లకే కాదు.. ఎలాంటి సవాళ్లకూ తలవంచమని అన్నారు.
దేవీ నవరాత్రి తొలి రోజు నుంచి కొత్త జీఎస్టీ సంస్కరణలు అమల్లోకి వస్తాయని, ప్రతీ దుకాణంలో “గర్వంగా చెప్పండి.. ఇది స్వదేశీ" అనే బోర్డు ఉండాలని అంటూ పిలుపునిచ్చారు. ఇవాళ్టికి మరో ప్రత్యేకత ఉందని పీఎం అన్నారు. హైదరాబాద్ సంస్థానం విముక్తి పొందిన శుభదినమని అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతోనే హైదరాబాద్ సంస్థానం భారత్ లో కలిసిందని గుర్తు చేశారు. నిజాం అకృత్యాల నుంచి సంస్థానానికి విముక్తి లభించిన ఈ ప్ర త్యేకమైన రోజున హైదరాబాద్ విమోచన దినం నిర్వహిస్తున్నామని మోదీ అన్నారు.
'స్వస్థ్ నారీ సశక్త్ పరివార్' ప్రారంభం
తన పుట్టిన రోజున మధ్యప్రదేశ్ లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ.. స్వస్థ్ నారీ సశక్త్ పరివార్, రాష్ట్రీయ పోషణ్ మాహ్ కార్యక్రమాలను ప్రారంభించారు. మహిళల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, మెరుగైన వైద్య సేవల ద్వారా కుటుంబాలను, దేశాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో ఈ పథకాలను తీసుకొచ్చామని ప్రధాని చెప్పారు.