ముంబై: మహారాష్ట్రలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. గడ్చిరోలి దండకారణ్యంలో భద్రత బలగాలు, నక్సల్స్ మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి చెందారు. ఎటపల్లి తాలూకాలో మోదస్కే గ్రామాన్ని ఆనుకుని ఉన్న అడవిలో మావోయిస్టుల గట్టా లాస్ (స్థానిక సంస్థ దళం) సభ్యులు ఉన్నారనిపోలీసులకు సమాచారం అందింది.. అప్రమత్తమైన భద్రతబలగాలు, పోలీసులు కూంబింగ్ నిర్వహించాయి. గడ్చిరోలి పోలీసుల ప్రత్యేక యాంటీనక్సల్ కమాండో స్క్వాడ్ సీ60 ఐదు యూనిట్లతో పాటు, అహేరి నుంచి సీఆర్పీఎఫ్ బృందం వెంటనే సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది.
ఈక్రమంలో మావోయిస్టులు వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈఘట నలో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి చెందారు. వారి వద్ద నుంచి ఆటోమేటిక్ ఏకే 47 రైఫిల్ సహా పెద్ద ఎత్తున ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈప్రాం తంలో నక్సల్ వ్యతిరేక కూంబింగ్ కార్యకలా పాలు ఇంకా కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.
