
హైదరాబాద్: శాసనమండలి సభ్యత్వానికి తాను చేసిన రాజీనామా ఇంకా ఆమోదించలేదని.. చైర్మన్ అందుబాటులో లేరని చెప్పా రని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు.
చిట్ చాట్ లో భాగంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ 'రాజీనామా ఆమోదించిన ఆర్నెళ్లలోగా ఎన్నికలు నిర్వ హించాలి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అంటున్నారు. నేను ఎమ్మెల్సీగా ఎన్నికైనపుడుఆర్నెళ్ల కంటే ఎక్కువ కాలం సీటు ఖాళీగానే ఉంది. అవసరమైతే మళ్లీ చైర్మన్ ను కలుస్త అంటూ కవిత చెప్పుకొచ్చారు.