Gemini Nano Banana AI Saree Trend: 'బనానా AI శారీ ట్రెండ్’.. ఈ యువతి పుట్టు మచ్చ.. గూగుల్ జెమినికి ఎలా తెలిసిందో..!

Gemini Nano Banana AI Saree Trend: 'బనానా AI శారీ ట్రెండ్’.. ఈ యువతి పుట్టు మచ్చ.. గూగుల్ జెమినికి ఎలా తెలిసిందో..!

గూగుల్ జెమిని 'బనానా AI చీర ట్రెండ్’ ప్రస్తుతం సోషల్ మీడియాను కుదిపేస్తోంది. ఇన్ స్టాగ్రాం ఓపెన్ చేస్తే మొత్తం ఈ ఫొటోలే కనిపిస్తున్నాయి. ప్రతినిత్యం ఇన్ స్టాలో మోడ్రన్ డ్రస్సుల్లో ఫొటోలు పోస్ట్ చేసే కొందరు అమ్మాయిలు ఈ 'బనానా AI శారీ ట్రెండ్’ను తెగ వాడేస్తున్నారు. అయితే.. ఈ ఏఐ శారీ ట్రెండ్ ఒక యువతికి చేదు అనుభవాన్ని మిగిల్చింది. తనకు ఎదురైన ఆ షాకింగ్ ఎక్స్ పీరియన్స్ను ఆమె తన ఇన్స్టాలో పోస్ట్ చేశారు. అసలేమైందంటే.. ప్రస్తుతం గూగుల్ జెమినిలో.. ప్రాంప్ట్ ఇచ్చి సినిమాటిక్ స్టైల్లో ఫొటోలు, వీడియోలు చేసుకుని వాటిని యువత సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలానే.. ఒక యువతి 'బనానా AI శారీ ట్రెండ్’ను వాడి వింటేజ్ లుక్లో శారీలో తాను ఎలా ఉంటానో చూసుకోవాలనుకుంది.

జెమినినీ శారీ లుక్లో ఫొటో కావాలని తన ఫొటోను అప్ లోడ్ చేసింది. గూగుల్ జెమిని ఆ యువతి కోరుకున్నట్టుగానే శారీ ఫొటో తయారుచేసి ఇచ్చింది. ఫొటో అదిరిపోయింది. కానీ.. ఆ యువతి శారీ లుక్లో ఉన్న తన ఫొటోను నిశితంగా చూసుకుని షాకయింది. తన శరీరంపై ఎడమ భుజంపై ఉన్న పుట్టుమచ్చను చూసి సదరు యువతి నివ్వెరపోయింది. తన శరీరంపై ఉన్న పుట్టు మచ్చ గూగుల్ జెమినికి ఎలా తెలిసిందని విస్మయం వ్యక్తం చేసింది. ఈ ట్రెండ్ ఎంతమాత్రం సేఫ్ కాదని.. అమ్మాయిలు తమ ఫొటోలు అప్ లోడ్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని ఈ యువతికి ఎదురైన చేదు అనుభవం రుజువు చేసింది.