War 2 OTT: ఓటీటీలోకి ఎన్టీఆర్ ‘వార్ 2’.. స్ట్రీమింగ్ డేట్పై లేటెస్ట్ అప్డేట్!

War 2 OTT: ఓటీటీలోకి ఎన్టీఆర్ ‘వార్ 2’.. స్ట్రీమింగ్ డేట్పై లేటెస్ట్ అప్డేట్!

ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన రీసెంట్ భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘వార్ 2’ (War 2). కియారా అద్వానీ హీరోయిన్‌. అయాన్ ముఖర్జీ తెరెకెక్కించాడు. ఆగస్టు 14న వరల్డ్‌‌‌‌వైడ్‌‌‌‌గా రిలీజైన ఈ మూవీ, త్వరలో ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. సినిమా థియేటర్లలో రిలీజై నెల రోజులు అయిపోయింది. ఈ క్రమంలోనే వార్ 2 కోసం ఆడియన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు. లేటెస్ట్గా వార్ 2 స్ట్రీమింగ్ అప్డేట్ బయటకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. 

వార్ 2 స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. సినిమా థియేట్రికల్ వెర్షన్‌లో వచ్చినప్పుడే, వార్ 2 OTT పార్ట్నర్ నెట్‌ఫ్లిక్స్ అనే విషయం తెలిసిపోయింది. లేటెస్ట్ బాలీవుడ్ నివేదికల ప్రకారం.. దసరా స్పెషల్గా అక్టోబ‌ర్ 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవ్వనున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఈ విషయంపై నిర్మాతలు ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.

అయితే, వార్ 2 ఇంకా పలు థియేటర్లలో రన్ అవ్వడమే ఆలస్యానికి కారణమని తెలుస్తోంది. ఈ మేరకు సెప్టెంబర్ లాస్ట్ వీక్లో వార్ 2 ఓటీటీ అప్డేట్ వచ్చే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాల నుంచి రివీల్ అయింది. ఈ లేటెస్ట్ అప్డేట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్లో కొత్త ఉత్సాహం నింపనుంది. 

ఇదిలా ఉంటే.. సౌత్ ఇండియాలో ఎన్టీఆర్ కు ఉన్న మాస్ ఫాలోయింగ్, హిందీలో హృతిక్కు ఉన్న క్రేజ్.. ఈ సినిమాను ఏమాత్రం నిలబెట్టలేకపోయాయి. బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించబోతోందని తమ ఫ్యాన్స్ ఆశించినప్పటికీ, అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది. ప్రముఖ ట్రేడ్ నివేదికల ప్రకారం.. వార్ 2 ప్రపంచవ్యాప్తంగా రూ.350 కోట్ల గ్రాస్, రూ. 236.54 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించిందని సమాచారం.