Zeptoలో ఆర్డర్ చేస్తున్నారా.. ? హైదరాబాద్ లో ఎంత దారుణం జరిగిందో చుడండి..!

Zeptoలో ఆర్డర్ చేస్తున్నారా.. ? హైదరాబాద్ లో ఎంత దారుణం జరిగిందో చుడండి..!

క్విక్ కామర్స్ యాప్స్ రాజ్యమేలుతున్న రోజులివి... ఇంట్లోకి కూరగాయలు మొదలుకొని ఏం కావాలన్నా ఇలా ఆర్డర్ చేస్తే అలా నిమిషాల్లో ఇంటి ముందు వాలిపోతున్నాయి. హైదరాబాద్ లాంటి సిటీల్లో Zepto, స్విగ్గి ఇన్స్టా మార్ట్, బ్లింకిట్ వంటి యాప్స్ గురించి తెలియనివారు ఉండరు అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. రోజుకో అఫర్ తో కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి ఈ యాప్స్. అయితే..హైదరాబాద్ లో Zepto డెలివరీ బాయ్స్ చేసిన ఈ పని గురించి తెలిస్తే.. ఆన్ లైన్లో సరుకులు ఆర్డర్ చేయాలంటే ఒక్క నిమిషం ఆలోచిస్తారు. కస్టమర్ ఆర్డర్ చేసిన ఐటమ్స్ డెలివరీ ఇవ్వకపోగా తిరిగి అతనిపైనే దాడికి దిగారు Zepto డెలివరీ బాయ్స్. మంగళవారం ( సెప్టెంబర్ 16 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.

హైదరాబాద్ లోని చిక్కడపల్లికి చెందిన సందీప్ సోమవారం ( సెప్టెంబర్ 15 ) అర్థరాత్రి సమయంలో Zeptoలో పెన్సిల్ కిట్,పెరుగు ఆర్డర్ చేశాడు. Zeptoలో ప్రీపెయిడ్ ఆర్డర్ చేసిన సందీప్ కి ఐటెం డెలివరీ కాలేదు. దీంతో సందీప్ డెలివరీ బాయ్ ని ప్రశ్నించగా VST SP గార్డెన్స్ దగ్గర ఉన్న Zeptoహబ్ కి వచ్చి మాట్లాడాలని చెప్పాడు.

Zepto హబ్ దగ్గరికి వెళ్లిన సందీప్ కి ఐటమ్స్ ఇవ్వకపోగా అతనిపైనే దాడికి దిగారు డెలివరీ బాయ్స్. వెంకట్, రాజు, సహా మరికొందరు డెలివరీ బాయ్స్ గంజాయి మత్తులో తనపై దాడికి పాల్పడ్డారని ఫిర్యాదు చేశాడు బాధితుడు. డెలివరీ బాయ్స్ సందీప్ పై దాడి చేసిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడి. సందీప్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన చిక్కడపల్లి పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.