BMW కార్ యాక్సిడెంట్ కేసు: మహిళ కాబట్టి బెయిల్ ఇవ్వండి.. కోర్టుకు నిందితురాలి విజ్ఞప్తి

BMW కార్ యాక్సిడెంట్ కేసు: మహిళ కాబట్టి బెయిల్ ఇవ్వండి.. కోర్టుకు నిందితురాలి విజ్ఞప్తి

ఢిల్లీ: బైక్ ను బీఎండబ్ల్యూ కారు ఢీకొని ఉద్యోగి మృతి చెందిన కేసులో నిందితురాలు గగన్ ప్రీత్ కౌర్ కు బెయిల్ ఇవ్వాలని ఆమె తరపు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. మహిళ కాబట్టి నిందితురాలికి బెయిల్ ఇవ్వవచ్చని పేర్కొన్నారు. జరిగిన ఘటన దురదృష్టకరమన్న న్యాయవాది రమేశ్ గుప్తా.. ఏటా దేశ వ్యాప్తంగా 5 వేల ప్రమాదాలు జరుగుతున్నట్లు చెప్పారు. 

గగన్ ప్రీత్ కౌర్ బీఎండబ్ల్యూ కారు ఢీకొని బైకుపై వెళుతున్న ఆర్థిక శాఖ సీనియర్ అధికారి వనజ్యోత్సింగ్ మృతి చెందగా, అతడి భార్య తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధిన రెండు రోజుల క్రితం పోలీసులు కౌర్ను అరెస్టు చేయగా.. ప్రస్తుతం ఆమె జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్నారు. నిందితురాలు బైక్ ను ఢీకొట్టిన డీటీసీ బస్సు, ఆ సమయంలో అటుగా వెళుతున్న అంబులెన్స్ పై కూడా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేయడం సంచలనంగా మారింది.