- ప్రపోజల్స్ రెడీ చేస్తున్న హెచ్ఎండీఏ
- ఇప్పటికే ఉప్పల్లో అందుబాటులోకి..
- త్వరలోనే ఉపయోగంలోకి మెహిదీపట్నం స్కైవాక్
- తొలగనున్న పాదచారుల ఇబ్బందులు
హైదరాబాద్‌సిటీ, వెలుగు: రోజూ అత్యంత రద్దీగా ఉండే కూకట్ పల్లి జేఎన్టీయూ జంక్షన్లో పాదచారులు ఇబ్బందులు పడుతూ రోడ్డు దాటుతుంటారు. ఈ కష్టాలకు చెక్‌పెట్టడానికి ఈ ప్రాంతంలో స్కైవాక్ నిర్మించాలని హెచ్ఎండీఏ నిర్ణయించింది. ప్రస్తుతం ఉప్పల్రింగ్రోడ్వద్ద నిర్మించిన స్కైవాక్పాదచారులకు ఎంతో ఉపయోగపడుతోంది. ఈ స్కైవాక్ద్వారా రోడ్డు దాటడానికి మాత్రమే కాకుండా, కూర్చునేందుకు కూడా ఏర్పాట్లున్నాయి. కాఫీ సెంటర్లు, ఫుడ్ కోర్టులు ఉన్నాయి. దీంతో సాయంత్రం వేళల్లో ఇక్కడికి వచ్చే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. మెహదీపట్నం వద్ద నిర్మిస్తున్న స్కైవాక్పై కూడా ఇలాంటి ఏర్పాట్లే చేస్తున్నారు. దీని నిర్మాణం కూడా దాదాపు పూర్తికావచ్చిందని అధికారులు అంటున్నారు. తాజాగా కూకట్పల్లి జేఎన్టీయూ వద్ద స్కైవాక్నిర్మాణంపై అధికారులు దృష్టిపెట్టారు.
మెట్రో నుంచి లులు మాల్ వరకు..
కూకట్పల్లి జేఎన్టీయూ నుంచి మెట్రోస్టేషన్వరకు, తిరిగి అక్కడి నుంచి లులుమాల్వరకు ఈ స్కైవాక్‌ను నిర్మించనున్నట్టు అధికారులు తెలిపారు. దాదాపు ఇది 600 మీటర్లు ఉంటుంది. నిర్మాణానికి ఎంత ఖర్చవుతుందన్న విషయంతో పాటు, పీపీపీ పద్ధతిలో నిర్మించాలా? లేక నేరుగా హెచ్ఎండీఏ ద్వారానే చేపట్టాలా? అనే విషయాలపై అధికారులు అధ్యయనం చేస్తున్నారు. త్వరలో దీనికి సంబంధించి డీటెయిల్డ్ప్రాజెక్ట్రిపోర్ట్ (డీపీఆర్) అందుబాటులోకి వస్తుందని అధికారులు తెలిపారు. త్వరలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్పరిసరాల్లోనూ ఓ భారీ స్కైవే నిర్మించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
