
ఆర్టీసీ కార్మికులకు బీజేపీ అండగా ఉంటుందన్నారు ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ . సూర్యపేట ఆర్టీసీ డిపో వద్ద కార్మికుల ఆందోళనకు మద్దతు తెలిపిన లక్ష్మణ్ కార్మికులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని సూచించారు. ప్రభుత్వం మెడలు వంచి కార్మికులకు న్యాయం చేస్తామన్నారు. ప్రభుత్వం దసరా సెలవులు పెంచడమే కార్మికుల తొలి విజయమని అన్నారు. ఏనాడు ఉద్యమంలో పాల్గొనని వ్యక్తి రవాణా శాఖ మంత్రిగా ఉన్నారని అన్నారు. ఆర్టీసీ సమ్మెపై కేంద్రం ఆరా తీసిందని..నిన్ననే బీజేపీ రాష్ట్ర కమిటీ గవర్నర్ కు నివేదిక ఇచ్చిందన్నారు.