ఎల్బీనగర్, వెలుగు: రాజకీయాలు ఎన్నికలు, ఓట్లకే పరిమితం కాకుండా ప్రజాసేవకు వేదికగా ఉం డాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు అన్నారు. నాగోల్‌లో బీజేవైఎం ఆధ్వర్యంలో సేవా సంకల్ప్ అభియాన్ లో భాగంగా బుధవారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. రాంచందర్ రావు మాట్లాడుతూ ప్రధాని మోదీ ప్రజాజీవితంలో 25 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్సీ మల్క కొమరయ్య, బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రశేఖర్ తివారీ, డా.ఎన్.గౌతం రావు, వీరేందర్ గౌడ్, కాసం వెంకటేశ్వర్లు, బండ కార్తీక రెడ్డి, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేశ్ కుందే పాల్గొన్నారు.
