జిట్టా బాలకృష్ణను సస్పెండ్ చేసిన బీజేపీ..ఎందుకంటే.?

జిట్టా బాలకృష్ణను సస్పెండ్ చేసిన బీజేపీ..ఎందుకంటే.?

యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన  జిట్టా బాలకృష్ణపై సస్పెన్షన్ వేటు పడింది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఉన్న ఆయనను పార్టీ నిబంధనలు ఉల్లంఘించారని రాష్ట్ర నాయకత్వం సస్పెండ్ చేసింది.  ఈ సస్పెన్షన్ తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది.  వారంలోపు రాష్ట్ర పార్టీకి వివరణ ఇవ్వాలని చెప్పింది.  యువ తెలంగాణ పార్టీని స్థాపించిన ఆయన పార్టీని బీజేపీలో విలీనం చేసిన విషయం తెలిసిందే..
 
రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ను తొలగించడంపై  జులై 25న జిట్టా బాలకృష్ణ అభ్యంతరం వ్యక్తం చేశారు.  బీజేపీ,బీఆర్ఎస్ రెండూ ఒకటేనని వ్యాఖ్యానించారు. గత 16 నెలలుగా బీజేపీలో ఉన్నా తనను ఒక్క కార్యక్రమం కూడా చెయ్యనియ్యలేదన్నారు.  తాను మానసికంగా ఎప్పుడో బీజేపీకి దూరమయ్యానని, కార్యకర్తగా మాత్రమే ఉన్నానని అన్నారు .ఇపుడున్న పరిస్థితుల్లో బీజేపీతో తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరవన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ పనిచేయడం లేదన్నారు.