టీచర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి : మల్క కొమరయ్య

టీచర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి : మల్క కొమరయ్య
  • బీజేపీ టీచర్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య డిమాండ్

 హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో టీచర్లు, ఉద్యోగులకు ఇచ్చిన హమీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని బీజేపీ టీచర్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఏ ఒక్కటీ నెరవేర్చలేదని ఆరోపించారు. తమ సమస్యల పరిష్కారానికి తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ చేపట్టిన ఆందోళనలకు బీజేపీ మద్దతు ఇస్తున్నదని చెప్పారు.

 సోమవారం ఆయన బీజేపీ స్టేట్ ఆఫీసులో ఎమ్మెల్సీ అంజిరెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. సమగ్ర శిక్ష ప్రాజెక్టు పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్టు టీచర్లను రెగ్యులరైజ్ చేయాలని మల్క కొమరయ్య డిమాండ్ చేశారు. ఐదు డీఏలు పెండింగ్​లో ఉన్నాయని వాటిని వెంటనే రిలీజ్ చేయాలని కోరారు.