అది అవినీతి నేతల కూటమి.. ప్రతిపక్షాల మీటింగ్​పై బీజేపీ చీఫ్​ నడ్డా ఫైర్​

అది అవినీతి నేతల కూటమి.. ప్రతిపక్షాల మీటింగ్​పై బీజేపీ చీఫ్​ నడ్డా ఫైర్​

 

  • ఇయ్యాల ఎన్డీయే మీటింగ్
  • మిత్రపక్షాలకు బీజేపీ ఆహ్వానం
  • 38 పార్టీలు హాజరు అవుతాయంటున్న నేతలు
  • మాది దేశ సేవ కోసం ఏర్పడిన కూటమన్న నడ్డా

అవినీతి, అక్రమాలకు పాల్పడిన నేతలు అవకాశవాదంతో ఏర్పాటు చేస్తున్న కూటమి అది.. స్కామ్ లు చేసి జైలుకు వెళ్లి బెయిల్​పై బయటకు వచ్చిన నేతలు ఒక్కచోట చేరుతున్నరు. ఆ కూటమికి ఓ విధానం లేదు.. ముందుండి నడిపించేందుకు లీడరూ లేడు. ఆ కూటమికి నిర్ణయాలు తీసుకునే అధికారమూ లేదు, ఆ మాటకొస్తే దానికో ఉద్దేశమనేదే లేదు. పదేళ్ల యూపీఏ పాలనలో జరిగిన అవినీతికి, స్కామ్​లకు పాల్పడ్డ నేతల గుంపు మాత్రమే.

న్యూఢిల్లీ/బెంగళూరు:  బీజేపీ ఆధ్వర్యంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్(ఎన్డీయే) సమావేశం మంగళవారం జరగనుంది. బెంగళూరులో ప్రతిపక్షాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీలో బీజేపీ ఏర్పాటు చేసిన ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. మొత్తం 38 పార్టీలు హాజరుకానున్నాయని బీజేపీ తెలిపింది. ఈ మీటింగ్‌‌‌‌కు ప్రస్తుత ఎన్డీయే పక్ష పార్టీలతోపాటు కొత్త పార్టీలు కూడా రానున్నాయని చెప్పింది. అన్ని రీజియన్లకు చెందిన పార్టీల ప్రతినిధులు వస్తారని, ఎన్డీయే బల ప్రదర్శన చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్పాయి. ఇది మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక ఏర్పాటు చేస్తున్న ఫస్ట్ ఎన్డీయే మీటింగ్‌‌‌‌. తన మిత్ర పక్షాలను బీజేపీ పట్టించుకోవడంలేదంటూ విమర్శలు రావడం, ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఈ భేటీ నిర్వహిస్తోంది.

వీళ్లు దూరం.. వాళ్లు దగ్గర..

చాలా ఏళ్లు బీజేపీ మిత్ర పక్షాలుగా ఉన్న జనతా దళ్ (యునైటెడ్), శివసేన (ఉద్ధవ్ థాక్రే), అకాళీదళ్ తదితర పార్టీలు ఇప్పుడు ఎన్డీయేకి దూరమయ్యాయి. మరోవైపు మహారాష్ట్రలో శివసేన (షిండే వర్గం), ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం).. యూపీలో ఓపీ రాజ్‌‌‌‌బర్‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలోని ఎస్‌‌‌‌బీఎస్‌‌‌‌పీ,  బీహార్‌‌‌‌‌‌‌‌లో జితన్‌‌‌‌ రామ్‌‌‌‌ మాంఝీ ఆధ్వర్యంలోని హిందుస్తానీ అవామ్ మోర్చా (సెక్యులర్), ఉపేంద్ర కుష్వాహా ఆధ్వర్యంలోని ఆర్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌ఎస్పీ తదితర పార్టీలు ఎన్డీయేలో చేరాయి. ప్రధాని నరేంద్ర మోదీ సహా బీజేపీ కీలక నేతలు హాజరయ్యే సమావేశానికి రావాలంటూ ఆయా పార్టీలకు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఆహ్వానాలు పంపారు. ఈ మేరకు తమిళనాడు  నుంచి ఏఐఏడీఎంకే, ఏపీ నుంచి పవన్‌‌‌‌ కల్యాణ్‌‌‌‌ ఆధ్వర్యంలోని జనసేన హాజరుకానున్నాయి. దివంగత రామ్‌‌‌‌ విలాస్ పాశ్వాన్ కొడుకు చిరాగ్ పాశ్వాన్‌‌‌‌ను కూడా ఆహ్వానించారు.

ALSO READ:కజిరంగా నేషనల్​ పార్క్​లోకి వరద

ఇంకా టైమ్ ఉంది కదా: కుమారస్వామి

వచ్చే లోక్‌‌‌‌సభ ఎన్నికలకు బీజేపీ, జేడీఎస్‌‌‌‌ పొత్తు పెట్టుకుంటాయంటూ జరుగుతున్న చర్చ అప్రస్తుతమని జేడీయూ నేత హెచ్‌‌‌‌డీ కుమారస్వామి అన్నారు. ఎన్నికలకు ఇంకా 8 నుంచి 9 నెలల సమయం ఉందని, ఏం జరుగుతుందో చూద్దామని అన్నారు. ‘‘ఇటు కాంగ్రెస్ కూటమి నుంచి కానీ, అటు ఎన్‌‌‌‌డీఏ నుంచి కానీ మాకు ఆహ్వానం అందలేదు. ఇన్విటేషన్ వచ్చిన తర్వాత మేం ఆలోచిస్తాం. మా పార్టీలో చర్చల తర్వాత నిర్ణయం తీసుకుంటాం” అని తెలిపారు.

38 పార్టీలు హాజరైతయ్..

ఎన్డీయే కూటమి సమావేశానికి 38 పార్టీలు హాజరవుతున్నాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వెల్లడించారు. ఎన్డీయే విస్తరిస్తున్నదని, ఏండ్లుగా కూటమి పరిధి పెరుగుతున్నదని నడ్డా చెప్పారు. నరేంద్ర మోదీ ప్రభుత్వ పథకాలు, విధానాల సానుకూల ప్రభావం వల్ల తమ భాగస్వామ్య పక్షాలు ఎంతో ఉత్సాహంతో ఉన్నాయని తెలిపారు. గత 9 ఏళ్లలో ఎంతోమంది ప్రశంసలు అందుకున్న ప్రధాని నరేంద్ర మోదీ బలమైన నాయకత్వాన్ని అందరం చూశామని తెలిపారు. 

ఎన్డీయే.. దేశానికి సేవ చేసేందుకు, దేశాన్ని బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన ఆదర్శ కూటమి అని అన్నారు. యూపీఏకి లీడరే లేరని, నిర్ణయాలు తీసుకొనే శక్తి కూడా లేదని ఎద్దేవా చేశారు. వారివి స్వార్థ ప్రయోజనాల ఆధారంగా ఏర్పడిన పొత్తులేనని విమర్శించారు. 10 ఏండ్ల యూపీఏ పాలన అవినీతిమయమని, 2024లోనూ మళ్లీ ప్రధాని మోదీ నేతృత్వంలో బీజేపీకి అధికారం ఇవ్వాలని ప్రజలు నిర్ణయించుకున్నారని అన్నారు.