బీజేపీని అధికారానికి దూరం చేయాలె

బీజేపీని అధికారానికి దూరం చేయాలె

తెలంగాణ సాయుధ పోరాట విషయంలో బీజేపీ చరిత్రను వక్రీకరిస్తోందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు. 1946 నుంచి సాయుధ పోరాటం కొనసాగిందని.. కమ్యూనిస్టుల పోరాటం అందుకు స్ఫూర్తినిచ్చిందన్నారు. కేంద్ర బలగాల కారణంగానే నిజాం తలొగ్గారని బీజేపీ చెప్పడంలో ఎలాంటి వాస్తవం లేదని అన్నారు. సీపీఎం కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఏచూరి.. 1948లో పోరాటం ముగిసిపోతే.. 1951 వరకు కేంద్ర బలగాలు ఎందుకు ఉన్నాయని ప్రశ్నించారు. 1950, 27 మార్చి వరకు ఎంతో మంది జైల్లో మగ్గిపోయారని, వారిలో 4482 మంది కమ్యూనిస్టులు కూడా ఉన్నారని అన్నారు. 

బీజేపీ మతోన్మాదాన్ని ప్రోత్సహిస్తూ.. మత ఘర్షణలకు ఊతం ఇస్తోందని ఏచూరి ఆరోపించారు. రాజ్యాంగాన్ని కాపాడాలన్నదే తమ ఉద్దేశ్యమన్న ఆయన.. బీజేపీని అధికారానికి దూరం చేస్తేనే ఇది సాధ్యమవుతుందని చెప్పారు. అందుకే మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు చెప్పారు. బీజేపీని ఎదుర్కోనేందుకు సీఎం కేసీఆర్ జాతీయ స్థాయిలో పార్టీ పెట్టాలనుకోవడం ఆయన వ్యక్తిగతమని ఏచూరి అభిప్రాయపడ్డారు.