విపక్షాలను ఏకతాటిపైకి తీసుకువస్తా

విపక్షాలను ఏకతాటిపైకి తీసుకువస్తా

బీజేపీపై బీహార్ సీఎం నితీష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్షాలు అన్నీ  కలిసి పోరాడితే  2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని 50 సీట్లకే పరిమితం చేయొచ్చని చెప్పారు. మోడీ ప్రభుత్వాన్ని గద్దెదింపేందుకు విపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడమే తన లక్ష్యంగా పనిచేస్తానన్నారు. సోమవారం నుంచి రెండురోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్న నితీష్ కుమార్..పలు రాజకీయపార్టీలకు చెందిన నేతలను కలవనున్నారని జేడీయూ వర్గాలు తెలిపాయి. బీజేపీకి ఎదుర్కొనేందుకు ఐక్యంగా కలిసి పోరాడాలని సూచించనున్నారు. 

మణిపూర్లో ఆరుగురు జేడీయూ ఎమ్మెల్యేల్లో ఐదుగురు కమలం పార్టీలోకి జాయిన్ అయ్యారు. పార్టీ చీఫ్ రాజీవ్ రంజన్ అకాలలన్ సింగ్, ఇతర పార్టీల శాసన సభ్యులను కొనుగోలు చేసేందుకు వారికి భారీగా డబ్బు ఆఫర్ చేసిందని మండిపడ్డారు. ఇలా చేయడం సరైన పద్ధతి కాదని...రాజ్యాంగ విరుద్ధమన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న బీజేపీకి వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామన్నారు. అందుకే విపక్ష పార్టీలను ఏకతాటిపైకి తీసుకువస్తామనే నమ్మకం ఉందన్నారు.