బీజేపీ మీ ఇల్లు కూల్చేస్తుందంటూ ఒవైసీ భయపెట్టాడు.. యూసుఫ్ పఠాన్‌పై మహువా ఫైర్!

బీజేపీ మీ ఇల్లు కూల్చేస్తుందంటూ ఒవైసీ భయపెట్టాడు.. యూసుఫ్ పఠాన్‌పై మహువా ఫైర్!

Mahua Moitra vs Yusuf Pathan: పశ్చిమ బెంగాల్ పాలిటిక్స్‌లో గందరగోళం కొనసాగుతుంది. తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీలో మునుపెన్నడూ లేని విధంగా ఒక పెద్ద తిరుగుబాటు మొదలైంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బహరంపూర్ నుంచి గెలిచి పార్లమెంట్‌లో అడుగుపెట్టిన మాజీ క్రికెటర్, టీఎంసీ ఎంపీ యూసుఫ్ పఠాన్‌తో సహా దాదాపు 20 మంది ఎంపీలు మమతా బెనర్జీకి బిగ్ షాక్ ఇచ్చారు. వీరంతా నేషనల్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (NCPI) లో విలీనం కావాలని స్పీకర్ ఓం బిర్లాకు లెటర్ ఇవ్వడం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. గత శీతకాల పార్లమెంట్ సమయంలోనే యూసుఫ్ పఠాన్‌ను ఏఐఎంఐఎం (AIMIM) చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ పార్లమెంట్‌లో భయపెట్టాడని, దానికి అతడు వణికిపోయాడంటూ శ్రీనగర్ ఎంపీ అగా సయ్యద్ రుహుల్లా మెహదీ ఎక్స్ (X) లో పెట్టిన పోస్ట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఈ పోస్ట్ పై టీఎంసీ ఫైర్ బ్రాండ్ లీడర్ మహువా మోయిత్రా ఇచ్చిన మాస్ రియాక్షన్ తీవ్ర చర్చకు దారి తీసింది. 

ఒవైసీ భయపెడితే షివరింగ్ అయ్యాడు: 
పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు నిరసన తెలుపుతున్న సమయంలో జరిగిన ఇంట్రెస్టింగ్ సీన్‌ను ఎంపీ అగా సయ్యద్ రుహుల్లా మెహదీ బయటపెట్టాడు. నిరసనల్లో పాల్గొంటున్న యూసుఫ్ పఠాన్ దగ్గరికి ఒవైసీ వచ్చి.. బీజేపీకి వ్యతిరేకంగా లొల్లి చేయొద్దని, అలా చేస్తే గుజరాత్‌లో ఉన్న నీ ఇల్లును బుల్డోజర్‌తో కూల్చేస్తారని వార్నింగ్ ఇచ్చాడట. ఆ మాట వినగానే యూసుఫ్ డల్ అయ్యాడు. ఆ భయంతో అతడు వణికిపోవడం (Almost shivering) నేను కళ్లారా చూశాను అంటూ మెహదీ రాసుకొచ్చాడు.

యూసుఫ్ పఠాన్ పై మహువా మోయిత్రా ఫైర్: 
మెహదీ పెట్టిన పోస్టుపై మహువా మోయిత్రా ఎక్స్ (X) వేదికగా చెలరేగిపోయింది. ఆరోజు తాను జోక్యం చేసుకుని పార్టీ నీ వెనుక ఉంది, భయపడకు అని ధైర్యం చెప్పానని గుర్తు చేసుకుంది. ధైర్యం, వెన్నుముక లేని ఒక ద్రోహి కోసం నేను గతంలో ఫైట్ చేసినందుకు చాలా బాధ పడుతున్నాను.. ఇట్ల భయపడే ఫట్టూ (Scared Phattu) కంటే.. అతడు హ్యాపీగా ఇంట్లోనే కూర్చుని క్రికెట్ కామెంట్రీ చేసుకుంటే బెటర్ అని విమర్శలు గుప్పించింది. 

టీఎంసీలో లొల్లి.. దీదీకి నెక్స్ట్ స్టెప్ ఏంది?: 
ప్రస్తుతం టీఎంసీ పరిస్థితి బెంగాల్‌లో చాలా క్రేజీగా మారింది. లోక్‌సభలో 20 మంది ఎంపీలు వెళ్లిపోవడమే కాకుండా.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే (NDA) కూటమికి సపోర్ట్ ఇస్తామని హింట్ ఇచ్చారు. అటు బెంగాల్ అసెంబ్లీలో కూడా మరో రెబెల్ గ్రూప్‌కు ఏకంగా 64 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ తిరుగుబాటుపై వర్షాకాల సమావేశాల కంటే ముందే స్పీకర్ ఓం బిర్లా ఫైనల్ డెసిషన్ తీసుకోనున్నారు.