పెట్రోల్, డీజిల్ వ్యాట్‌ తగ్గించాలంటూ బీజేపీ ఆందోళనలు

పెట్రోల్, డీజిల్ వ్యాట్‌ తగ్గించాలంటూ బీజేపీ ఆందోళనలు

పెట్రోల్, డీజిల్ పై రాష్ట్ర ప్రభుత్వం  వ్యాట్ తగ్గించాలంటూ రేపటి నుంచి  రాష్ట్ర వ్యాప్తంగా  ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది బీజేపీ. పెట్రోల్, డీజిల్ పై  విధించిన 35.2 శాతం వ్యాట్ ను తగ్గించకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందంటూ  ఆందోళనలు చేయనుంది.

 ఈ నెల 29న,30న అన్ని మండల కేంద్రాల్లో ఎడ్ల బండ్లపై బీజేపీ కార్యకర్తలు ధర్నాలు. డిసెంబర్ 1న బీజేవైఎం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాల్లో ప్లకార్డులు, నల్లబ్యాడ్జీలతో నిరసన .  2న మహిళా మోర్చా ఆధ్వర్యంలో కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలపై బ్యానర్లతో నిరసన. 3న ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో  జిల్లా కేంద్రాల్లోని అంబేద్కర్ విగ్రహాల వద్ద ధర్నాలు. 4న ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో గాంధీ విగ్రహాల వద్ద ధర్నాలు. 5న ఎస్టీ మోర్చా, 6న కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మార్కెట్ యార్డుల వద్ద నిరసన తెలపనున్నారు. డిసెంబరు 7న మైనార్టీ మోర్చా కార్యకర్తలు ధర్నా చేయనున్నారు.