హైదరాబాద్, వెలుగు: తెలంగాణకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ వచ్చినా.. ఇంకెవరొచ్చినా ఇక్కడి నాయకులు బీఆర్ఎస్తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంటే తప్ప ఆ పార్టీ గెలిచే పరిస్థతి ఉండదని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.
సోమవారం గాంధీ భవన్లో ఆయన మీడియా మాట్లాడుతూ.. నబిన్ తెలంగాణ పర్యటన తీరును చూస్తే ఆయనకు ఇక్కడి పరిస్థితులపై ఎలాంటి అవగాహన లేదని స్పష్టమవుతుందన్నారు. ఇక్కడి బీజేపీ నేతలు ఆయనకు సరైన సమాచారం ఇవ్వలేదనేది ఆయన మాటల తీరుచూస్తే అర్థమవుతుందన్నారు. తెలంగాణలో బీజేపీకి ఎజెండానే లేదని, ఆ పార్టీ ఇక్కడ అధికారంలోకి వచ్చేది లేదు, సచ్చేది లేదని స్పష్టం చేశారు.
