
హైదరాబాద్, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీ తల్లిపై కాంగ్రెస్ నేతలు ఆ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ ముందే అనుచిత వ్యాఖ్యలు చేశారని, వెంటనే ప్రజలకు రాహుల్ క్షమాపణ చెప్పాలని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి డిమాండ్ చేశారు.
ఆదివారం బీజేపీ స్టేట్ ఆఫీస్ నుంచి శిల్పారెడ్డి నేతృత్వంలో గాంధీ భవన్ ముందు నిరసన తెలిపేందుకు బీజేపీ మహిళా మోర్చా కార్యకర్తలు బయల్దేరుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీజేపీ స్టేట్ ఆఫీసు ముందే మోర్చా నేతలు బైఠాయించి నిరసన తెలిపారు.