సంజయ్​ని పదవి నుంచి తొలగించారని బీజేపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం

సంజయ్​ని పదవి నుంచి తొలగించారని బీజేపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం

ఖమ్మం, వెలుగు: ఎంపీ బండి సంజయ్​ని బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించడంపై ఆవేదన చెందుతూ ఓ బీజేపీ కార్యకర్త ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఖమ్మం అర్బన్ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్న గజ్జల శ్రీనివాస్ మంగళవారం తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. ‘సంజయ్​ని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించడం బాధ కలిగించింది’ అంటూ సూసైడ్ లెటర్ రాశాడు. వెంటనే కుటుంబ సభ్యులు గుర్తించి శ్రీనివాస్​ను ఖమ్మంలోని ఒక ప్రైవేట్​ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం శ్రీనివాస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయనకు ప్రాణాపాయం లేదని డాక్టర్లు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న బీజేపీ జాతీయ నాయకుడు, తమిళనాడు రాష్ట్ర సహా ఇన్​చార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి, శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. డాక్టర్లతో మాట్లాడి శ్రీనివాస ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ ఇతర నేతలు ఆసుపత్రిలో శ్రీనివాస్​ను పరామర్శించారు.