విస్కీలో బ్లాక్ ఫంగస్.. మద్యపాన ప్రియులు మేలుకోవాల్సిన ఘటన..!

విస్కీలో బ్లాక్ ఫంగస్.. మద్యపాన ప్రియులు మేలుకోవాల్సిన ఘటన..!

బీర్ సీసాలో పాములు, పురుగులు, వ్యర్థాలు వచ్చిన ఘటనలు గురించి వినే ఉంటారు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట వైరల్ అవుతుంటాయి. నిజామాబాద్ జిల్లాలో కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. విస్కీ తాగి రిలాక్స్ అవుదామని వైన్ షాప్ కి వెళ్లి ఓ ఫుల్ బాటిల్ కొన్నాడు మద్యం ప్రియుడు. ఫ్రెండ్స్ తో కలిసి తాగుదామని విస్కీ బాటిల్ ఓపెన్ చూడగా అందులో ఫంగస్ రావడంతో అవాక్కయ్యాడు బాధితుడు.

అయితే.. అందరిలాగా వీడియో తీసి ఇంటర్నెట్ లో అప్ లోడ్ చేయడంతో ఆగిపోలేదు బాధితుడు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసి.. మందు బాటిల్ అమ్మిన వైన్ షాప్ ముందు ధర్నాకు దిగాడు బాధితుడు. రూ. రెండు వేలు పెట్టి ఫుల్ బాటిల్ కొన్నానని.. అందులో ఫంగస్ వచ్చినట్లు కంపెనీకి వీడియో కూడా తీసి పంపానని.. అయినా ఎలాంటి రెస్పాన్స్ లేదని వాపోయాడు బాధితుడు.

వైన్ షాప్ దగ్గరికి వచ్చి ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని అంటున్నాడు బాధితుడు. ఈ ఘటనను ఇక్కడితో వదిలే ప్రసక్తి లేదని..సదరు వైన్ షాప్ లైసెన్స్ రద్దయ్యేదాకా ఉద్యమం చేస్తానని అంటున్నాడు బాధితుడు. ఇదే వైన్ షాపులో ఏడు మద్యం బాటిళ్లు తీసుకెళ్తే రెండింటిలో బ్లాక్ ఫంగస్ వచ్చిందని అంటున్నాడు బాధితుడు. ఏదేమైనా.. మద్యంలో కల్తీని వీడియో తీసి వదిలేయకుండా పోలీసులకు ఫిర్యాదు చేసి మందుబాబులకు ఆదర్శంగా నిలిచాడు బాధితుడు.