నల్లగా పాలేరు రిజర్వాయర్ ​నీళ్లు..ఆందోళనలో ప్రజలు

 నల్లగా పాలేరు రిజర్వాయర్ ​నీళ్లు..ఆందోళనలో ప్రజలు

కూసుమంచి, వెలుగు: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని పాలేరు రిజర్వాయర్ ​నీళ్లు నల్లగా మారాయి. ఈ రిజర్వాయర్​ నీటిని మిషన్​భగీరథ పథకం కింద సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్​ ప్రజలకు సరఫరా చేస్తున్నారు. వారం రోజులుగా సాగర్ ​కాల్వ నుంచి రిజర్వాయర్​కు నల్లగా ఉన్న నీళ్లు వస్తున్నాయి. దీంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. 

ఈ విషయం సోషల్​ మీడియాలో వైరల్​ కావడంతో ఈఈ వాణిశ్రీ  నీటి శాంపిల్స్​ సేకరించి పరీక్షకు పంపించారు. నాగార్జున సాగర్​ డెడ్​ స్టోరేజ్​లో ఉండడంతో నల్లగా ఉన్న నీళ్లు సరఫరా అవుతున్నాయని ఐబీ ఆఫీసర్లు చెబుతున్నారు.