ఇరాన్ లో జంట పేలుళ్లు.. 73 మంది మృతి.. 170 మందికి గాయాలు

ఇరాన్ లో జంట పేలుళ్లు.. 73 మంది మృతి.. 170 మందికి గాయాలు

ఇరాన్లో పేలుళ్లతో అట్టుడికి పోయింది. కెర్మాన్లోని ఖాసిమ్ సులేమానీ సమాధికి సమీపంలో రెండు చోట్ల జరిగిన బాంబ్ బ్లాస్ట్ లలో 73 మంది మృతి చెందారు. 170 కి పైగా గాయాలపాలయ్యారు. వేర్వేరు ప్రాంతాల్లో చేతి సంచుల్లో అమర్చిన బాంబులు పేలడంతో ఈ ఘటన  జరిగినట్లు తెలుస్తోంది. ఇరాక్ లో యూఎస్ డ్రోన్ దాడిలో మరణించిన రివల్యూషనరీ గార్డ్ ఎలైట్ కుడ్స్ ఫోర్స్ అధిపతి సులేమాని సమాధికి సమీపంలో పేలుళ్లు సంభవించాయి.  సులేమాన్ చనిపోయిన రోజున కెర్మాన్ లోని ఆయన సమాధి వద్దకు చేరుకున్న వేలాది మంది జనంపై ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. 

ఇంతకీ ఎవరీ సులేమాన్.. 

సులేమాన్.. ఇరన్ ప్రాంతీయ సైనిక కార్యకలాపాలకు రూపశిల్పి. ఇరాన్ దైవ పరిపానల మద్దతుదారు. 2020 జనవరిలో  ఇరాక్ లో యూఎస్ డ్రోన్ దాడిలో మరణించాడు. సులేమాన్ మరణం అప్పట్లో సంచలనం సృష్టించింది. 2020లో సులేమానీ అంత్యక్రియలకు వేలాది మంది తరలిరావడంతో తొక్కిసలాట జరిగి 56 మంది మృతిచెందారు. 200 మందికి పైగా గాయపడ్డారు.