18 మందితో బీఎల్ఎఫ్ ఫస్ట్ లిస్ట్​

18 మందితో  బీఎల్ఎఫ్ ఫస్ట్ లిస్ట్​

హైదరాబాద్, వెలుగు:  తెలంగాణలో బహుజన రాజ్యస్థాపనే లక్ష్యంగా పనిచేస్తామని బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్) ప్రకటించింది. ఆదివారం హైదరాబాద్​లోని ఓంకార్ భవన్​లో నిర్వహించిన సమావేశంలో బీఎల్​ఎఫ్ చైర్మన్ నల్లా సూర్యప్రకాశ్, ఎంసీపీఐ(యూ) జాతీయ ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్, బీఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ దండి వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సూర్యప్రకాశ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని 119 స్థానాల్లో బీఎల్ఎఫ్ పోటీ చేస్తుందని వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే 18 మంది అభ్యర్థుల తొలి జాబితాను రిలీజ్ చేశారు.

 కామారెడ్డి నుంచి -ఎస్. సిద్ధిరాములు, నాగార్జునసాగర్ నుంచి పోతుగంటి కాశీ,  మిర్యాలగూడ నుంచి వస్కుల గోపి, హుజూర్ నగర్ నుంచి వస్కుల సైదమ్మ, పరకాల నుంచి గోనె కుమారస్వామి, నర్సంపేట నుంచి పెద్దారపు రమేశ్, ఖమ్మం -నుంచి లిక్కి కృష్ణారావు యాదవ్, నకిరేకల్ నుంచి నూనె వెంకటస్వామి,  నిజామాబాద్ అర్బన్ నుంచి సబ్బని లత, వర్ధన్నపేట నుంచి మాస్ సావిత్రి, వరంగల్ పశ్చిమ నుంచి -గడ్డం నాగార్జున, వరంగల్ తూర్పు- నుంచి సుంచు జగదీశ్వర్ పటాన్ చెరు-నుంచి కర్ర దానయ్య, తుంగతుర్తి నుంచి వీర పాపయ్య, అచ్చంపేట- నుంచి ఎలిమినేటి శ్రీశైలం, తాండూర్ నుంచి మారోజు సునీల్, జుక్కల్ నుంచి కర్రెవార్ నాగేశ్, ఎల్బీనగర్ నుంచి రాయబండి పాండురంగచారిని అభ్యర్థులగా ప్రకటించారు.