పెండ్లికి పోతే దావత్ బదులు..

పెండ్లికి పోతే దావత్ బదులు..

కృష్ణానగర్‌ (వెస్ట్‌ బెంగాల్‌): ఆవిడో ఫిలాసఫీ టీచర్‌. మంగళవారం పెండ్లి. ఇంకేముంది. ఇంటి ముందు టెంట్లు, ఇంటి మీద లైట్లు, ఇంటెనుక వంటలు.. అబ్బో అని అనుకునేరు. అస్సలు అలా చేసుకోలేదా లేడీ మాస్టర్‌. పెండ్లి రోజునే బ్లడ్‌ డొనేషన్‌ క్యాంప్‌ పెట్టింది. లోకల్‌ స్టూడెంట్లకు బుక్స్‌ పంచింది. ఇంటికి వచ్చిన వాళ్లందరికీ ఒక్కో మొక్కను అందించింది. ఆమె పేరు నూర్జహాన్‌ ఖటున్‌ (28). వెస్ట్‌ బెంగాల్‌లోని నదియా జిల్లా ధుబులియాలో ఉంటుంది. ముర్షిదాబాద్‌కు చెందిన స్కూల్‌ టీచర్‌ ఒబిదుర్‌ రెహమాన్‌ను మంగళవారం పెండ్లి చేసుకుంది. పెండ్లి నాడు బ్లడ్‌ డొనేషన్‌కు ఆమె పిలవడంతో చుట్టాలు, ఫ్రెండ్స్‌, తెలిసినోళ్లు ఇలా ఓ 32 మంది వచ్చారు. రక్తదానం చేశారు. కరోనా వల్ల బ్లడ్‌ బ్యాంకుల్లో రక్తం దొరకట్లేదని తెలిసిందని, ఎమర్జెన్సీలో ఉన్న వాళ్లకు ఏదో చిన్న సాయంగా తన వంతు ట్రై చేశానని నూర్జహాన్‌ చెప్పారు. బోర్డు ఎగ్జామ్‌లో మంచి మార్కులు తెచ్చుకున్న స్టూడెంట్లను ప్రోత్సహించడానికి బుక్స్‌ పంచానన్నారు.

అందరూ సహకరించారు: నూర్జహాన్‌ తండ్రి

తన కూతురు మొదలుపెట్టిన ఈ చిన్న కార్యక్రమానికి ఫ్రెండ్స్‌, రిలేటివ్స్‌ కూడా మంచి మనసుతో సహకరించారని తండ్రి రుస్తుమ్‌ అలీ షేక్‌ చెప్పారు. ‘తన పెండ్లి జరిగే రోజున బ్లడ్‌ డొనేషన్‌ క్యాంప్‌ పెడదామని నూర్జహాన్‌ చెప్పినప్పుడు ఆ కార్యక్రమంతో పాటు ఇంకేదైనా చేయాలనిపించింది. అందుకే వచ్చిన వాళ్లకు ప్రజెంట్‌ చేయడానికి మొక్కలు తీసుకొచ్చా’ అన్నారు. నూర్జహాన్‌ పనిని కృష్ణానగర్‌ బ్లాక్‌ 2 బీడీవో అరబింద బిశ్వాస్‌ ప్రశంసించారు. బుక్స్‌ డిస్ట్రిబ్యూషన్‌లో ఆయన కూడా పాల్గొన్నారు.

For More News..

2 ఇన్​ 1 మెడిసిన్! కరోనాకు సరికొత్త మందు

వచ్చే జనవరిలో శశికళ రిలీజ్!

డిజిటల్ గోల్డ్‌పై జనాల ఆసక్తి..

ఇకనుంచి బ్యాంకుకు వెళ్లక్కర్లేదు.. ఉద్యోగులే మీ ఇంటికొస్తరు..