బ్లడ్ బ్యాంకులకు డీసీజీఐ హెచ్చరిక: రక్తానికి డబ్బులు వసూలు చేయొద్దు

బ్లడ్ బ్యాంకులకు డీసీజీఐ హెచ్చరిక: రక్తానికి డబ్బులు వసూలు చేయొద్దు

బ్లడ్ బ్యాంకులు, ఆస్పత్రులకు డీసీజీఐ సీరియస్ హెచ్చరిక జారీ చేసింది. ప్రాసెసింగ్ ఫీజు తప్పా అదనంగా డబ్బులు వసూలు చేయకూడదని ఆదేశించింది. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) ఇటీవల రక్తాదానాలు , దేశంలోని బడ్ల్ బ్యాంకుల పనితీరుకు సంబంధించిన ముఖ్య మైన నిర్ణయం తీసుకుంది. రక్తం విక్రయాలను నియంత్రించేందుకు గాను రక్తాన్ని విక్రయించకూడదనే విధానాన్ని ఖచ్చితంగా పాటించాలని DCGI అన్ని బ్లడ్ బ్యాంకులను ఆదేశించింది.  

సవరించిన మార్గదర్శకాల ప్రకారం.. రక్తం లేదా బ్లడ్ కాంపోనెంట్ లకు మాత్రమే ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేయవచ్చని నిర్దేశించింది. ఇది రక్తం లేదా బ్లడ్ కాంపోనెంట్ లకు రూ. 250 నుంచి రూ. 1,550 మధ్య ఉంటుంది. 

అధికారిక లెక్కల ప్రకారం.. రక్తదానం చేయని పక్షంలో ఒక యూనిట్ రక్తాన్ని ప్రైవేట్ ఆస్పత్రులు రూ. 3వేల నుంచి 8 వేల వరకు ఉంటుంది. రక్తం కొరత, అరుదైన్ బ్లడ్ గ్రూపుల కోసం అదనంగా చార్జీలు ఎక్కువగా ఉండవచ్చు. 

ఈ నిర్ణయంతో రక్తం వ్యాపారీకరణను నిరోధించడం, మనవతా డోనేషన్ చర్యను పెంపొందించడం, రక్తం విక్రయాన్ని నిరోధించడం ద్వారా వైద్య పరమైన అత్యవసర పరిస్థితుల్లో రక్తం కోసం పెరుగుతున్న డిమాండ్ ను తీర్చడానికి అవసరమైన స్వచ్ఛంద కార్యక్రమాలను ప్రోత్సహించాలని డీసీజీఐ భావిస్తోంది. డీసీజీఐ  నిర్ణయం ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో నైతిక పద్దతులను ప్రోత్సహించేందుకు ఒక సానుకూల ముందడుగు.