నదిలో పడవ బోల్తా.. ఆరుగురు మహిళలు గల్లంతు

నదిలో పడవ బోల్తా.. ఆరుగురు మహిళలు గల్లంతు

నదిలో పడవ బోల్తా పడి ఆరుగురు మహిళలు గల్లంతయ్యారు. ఈ విషాద సంఘటన మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో  చోటుచేసుకుంది. జనవరి 23వ తేదీ మంగళవారం జిల్లాలోని ఘన్‌పూర్ గ్రామం సమీపంలో  వైనగంగా నదిలో ఓ పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మహిళలు గల్లంతైనట్లు సమాచారం.  సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది.. వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. నిన్న సాయంత్రం ఇద్దరు మహిళల మృతదేహాలు లభించినట్లు గడ్చిరోలి ఎస్పీ నీలోత్పాల్ తెలిపారు. ప్రస్తుతం గల్లంతయిన మహిళల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.

చంద్రాపూర్‌లోని పాంభూర్న తహసీల్‌లోని కోట్ గ్రామంలో మిరప పొలాల్లో పని చేసేందుకు పడవలో మహిళా వ్యవసాయ కూలీలు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే, పడవలో ఎంతమంది మహిళలు ఉన్నారనే విషయం ఇంకా తెలియరాలేదని ఆయన తెలిపారు.