నెల్లూరు: 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవకు పెను ప్రమాదం తప్పింది. బ్యాలెన్స్ తప్పడంతో పడవ ఒక్కసారిగా సగం మునిగింది. దీంతో అలెర్ట్ అయిన స్థానికులు ప్రయాణికులను క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. వేరే పడవలతో వెళ్లి వారిని రక్షించారు. దీంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ సంఘటన శుక్రవారం పులికాట్ సరస్సులో జరిగింది. బీవీపాలెం నుంచి ఇరకందీవికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
