ఇసుక అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాలి : సబ్ కలెక్టర్ వికాస్ మహతో

ఇసుక అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాలి : సబ్ కలెక్టర్ వికాస్ మహతో

బోధన్​, వెలుగు : ఇసుక అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ వికాస్ మహతో రెవెన్యూ, పంచాయతీ అధికారులకు సూచించారు. సోమవారం బోధన్​ సబ్ కలెక్టర్ ఆఫీస్​లో ‘మన ఇసుక వాహనం’పై నిర్వహించిన  అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.  

ఇందిరమ్మ ఇండ్లకు సరఫరా అయ్యే ఇసుక లోడ్ల వివరాలను పంచాయతీ సెక్రటరీలు తప్పనిసరిగా రిజిస్ట్రర్లలో నమోదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో బోధన్​, సాలూర తహసీల్దార్లు విఠల్, శశిభూషణ్​, సాలూర ఎంపీడీవో శ్రీనివాస్​, పంచాయతీ కార్యదర్శులు, జీపీవోలు, పట్టణ వార్డు ఇన్​చార్జిలు పాల్గొన్నారు.