కరీంనగర్ జైలు నుంచి శోభ విడుదల

కరీంనగర్ జైలు నుంచి శోభ విడుదల

కరీంనగర్ జైలు నుంచి బీజేపీ నేత బొడిగె శోభ విడుదలయ్యారు. హైకోర్టు నిన్ననే ఆమెకు బెయిల్ ఇచ్చింది. అయినా జైలు అధికారులకు ఆర్డర్ కాపీ సమర్పించడంలో ఆలస్యం కావడంతో శనివారం ఉదయం అధికారులు శోభను విడుదల చేశారు. 

ఉద్యోగులు, ఉపాధ్యాయుల పక్షాన తమ గొంతు వినిపించినందుకు ప్రభుత్వం కక్ష కట్టి జైలుకు పంపిందని శోభ అన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల పక్షాన గొంతు వినిపించినందుకు ప్రభుత్వం జైలుకు పంపిందన్నారు. 317 జీవోను  సవరించాలని అడిగినందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మీద, అలాగే మిగిలిన నేతల మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి  జైలుకు పంపించారని ఫైర్ అయ్యారు. ఈ పరిణామాలన్నీ ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రజలు.. 2023లో ఒక ఆలోచనతో ఓట్లు వేస్తారని అనుకుంటున్నాని శోభ అన్నారు. నేను మాట్లాడటమే నేరంగా భావించి కేటీఆర్ స్వయంగా సీపీతో మాట్లాడి కేసులు పెట్టించారని తెలిసిందని ఆమె అన్నారు. అయినా తాను ఉద్యమ చరిత్ర ఉన్న బిడ్డనని... ఉద్యమకారులు కేసులకు భయపడరని శోభ అన్నారు. ప్రతిపక్ష నేతగా ప్రజల కోసం పోరాడటం తన ధర్మమని ఆమె అన్నారు.