పెద్ద ప్రమాదం తప్పింది: రన్ వేపై విమానం రెక్కులు కొట్టుకున్నాయి

పెద్ద ప్రమాదం తప్పింది: రన్ వేపై విమానం రెక్కులు కొట్టుకున్నాయి

అమెరికన్ ఎయిర్ లైన్స్ విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది. గెరిట్ తుఫాన్ బలమైన గాలుల కారణంగా లండన్ లోని హిత్రూ విమానాశ్రయంలో ల్యాండింగ్ సమస్య ఎదుర్కొంది. విపరీతమైన గాలులతో బోయింగ్ 777 రెక్కలు రన్ వేపై భూమివైపు వంగిపోయాయి. ఇంకొంచెం వంగితే భారీ ప్రమాదమే సంభవించేది. దీనికి సంబం ధించిన దృశ్యాలను కొందరు షూట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. 

విమానం ల్యాండింగ్ సమయంలో తుఫాన్ కారణంగా రన్ వే పైన దూసుకుపోతున్నప్పుడు రెక్కలు భూమి వైపు వంగడంతో అప్రమత్తమైన పైలట్ కొద్దిసేపటి తర్వాత విమానాన్ని నియంత్రణలోకి తెచ్చాడు. ఈవీడియోను షూట్ చేసిన వ్యక్తి  ఓహ్!ఓహ్!ఓహ్! స్టాప్ అంటూ అరుస్తున్న ఆడియో ఈ వీడియోల వినిపిస్తుంది. 

ప్రతి కూల వాతావరణ పరిస్థితుల కారణంగా లండన్ లోని హిత్రూ విమానాశ్రయంలో అనేక విమానాలు రద్దు చేయబడ్డాయి. గెరిట్ తుఫాను కారణంగా యూకెలో అనేక ప్రాంతాలకు బలమైన ఈదురు గాలులు, భారీ వర్షం తో  విమాన సర్వీసులతోపాటు రైలు సర్వీస్ లను కూడా నిలిపివేశారు. ఇంగ్లండ్ దక్షిణ తీర ప్రాంతాల్లో గాలులు బలంగా వీస్తున్నాయి. తీర ప్రాంతాల్లో 70 mph వేగంతో వీస్తున్నాయి.