
మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు బొగత జలపాతం పరవళ్లు తొక్కుతోంది. చత్తీస్‌గఢ్ అడవుల్లోని కొండలు, వాగులు పొంగడంతో జలపాతానికి భారీగా వరద నీరు వస్తోంది. వరద ఉధృతికి జలపాతం సమీపంలోని వ్యూ పాయింట్, స్విమ్మింగ్ పూల్ మునిగిపోయాయి. దీంతో పర్యాటకులను అనుమతించడం లేదు. డేంజర్ జోన్లుగా గుర్తించిన ప్రాంతాల్లోకి పర్యాటకులు వెళ్లకుండా సెక్యూరిటీ పెంచారు. - వెంకటాపురం, వెలుగు