బాయిలర్స్ విభాగం జేడీ ఆస్తులు జప్తు చేసిన ఈడీ

బాయిలర్స్ విభాగం జేడీ ఆస్తులు జప్తు చేసిన ఈడీ

 హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర బాయిలర్స్‌‌‌‌ విభాగం జాయింట్‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌ (జేడీ) మొలుగు విజయ్‌‌‌‌ కుమార్‌‌‌‌ ఆస్తులను ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్‌‌‌‌ డైరెక్టరేట్‌‌‌‌ (ఈడీ) జప్తు చేసింది. ఆయనతో పాటు కుటుంబ సభ్యుల పేరిట ఉన్న రూ.94.44 లక్షల విలువైన స్థిరాస్తులు, రూ.23.20 లక్షల నగదు కలిపి మొత్తంగా రూ.1.17 కోట్ల ఆస్తులను జప్తు చేసినట్టు ఈడీ అధికారులు తెలిపారు. ఆదాయానికి మించి ఆస్తులను కలిగి ఉన్నారనే ఆరోపణలతో విజయ్ కుమార్ పై  ఏసీబీ సెంట్రల్ యూనిట్ అధికారులు కేసు నమోదు చేశారు. 

మొత్తంగా రూ.2.19 కోట్లు అక్రమాస్తులు ఉన్నట్టు గుర్తించారు. దీనిపై మనీలాండరింగ్ చట్టాల కింద ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా రూ.1.17 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను జప్తు చేసినట్టు ఈడీ అధికారులు గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు. కేసు దర్యాప్తును కొనసాగిస్తున్నట్టు వారు పేర్కొన్నారు.