అనంతపురం జిల్లా తాడిపత్రిలో రోడ్డు ప్రమాదం జరిగింది. చుక్కలూరు క్రాస్ దగ్గర కూలీలతో వెళుతున్న బొలెరో వెహికల్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడిక్కడే చనిపోయారు. పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు గాయపడిన వారిని తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు . ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
