దేశంలోనే బెస్ట్ కాలనీగా బొల్లారం ఆర్ అండ్ ఆర్ కాలనీ

V6 Velugu Posted on Jun 14, 2021

సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మ సాగర్ జలాశయం నిర్వాసితుల కోసం ఏర్పాటు చేసిన తునికి బొల్లారం ఆర్ అండ్ ఆర్ కాలనీని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ సందర్శించారు. తునికి బొల్లారం ఆర్ అండ్ ఆర్ కాలనీలో ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలు, ఇండ్లను ఆయన పరిశీలించారు. జిల్లా కలెక్టర్ వెంకట్రామ రెడ్డిని అడిగి కాలనీకి చెందిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిర్వాసితులతో మాట్లాడి.. మరిన్ని వివరాలు తెలుసుకున్నారు. ‘తునికి బొల్లారం ఆర్ అండ్ ఆర్ కాలనీ చాలా బాగా వచ్చింది. కాలనీ లే అవుట్, అంతర్గత రోడ్లు, మౌలిక సదుపాయాలు బాగున్నాయి. దేశంలోనే బెస్ట్ కాలనీగా తునికి బొల్లారం ఆర్ అండ్ ఆర్ కాలనీ ఉండనుంది’ అని ఆయన అన్నారు.

ఈ పర్యటనలో సీఎస్ సోమేష్ కుమార్ వెంట రాష్ట్ర ఐ.టి. శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, కలెక్టర్ వెంకట్రామ రెడ్డి, అదనపు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, ఆర్డీఓ విజయేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Tagged Telangana, siddipet, CS Somesh kumar, Kondapochamma Sagar, , bollaram R and R colony

Latest Videos

Subscribe Now

More News