స్టార్ హీరోల సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కి మంచి ఇంపాక్ట్ ఉంటుంది. దీంతో చాలామంది డైరెక్టర్లు క్రేజ్ ని బట్టి పలువురు స్టార్ హీరోయిన్లతో స్పెషల్ సాంగ్స్ చేస్తుంటారు. అయితే ఒకప్పుడు స్పెషల్ సాంగ్స్ లో నటించి ఆడియన్స్ ని మెప్పించిన బాలీవుడ్ బ్యూటీఫుల్ హీరోయిన్ మల్లికా షెరావత్ మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ క్రమంలో బాలీవుడ్ లో ప్రముఖ స్టార్ హీరో రాజ్ కుమార్ రావు మరియు అనిమల్ మూవీ ఫేమ్ తృప్తి దిమ్రి కలసి నటించిన విక్కీ విద్యా క వో వాలా వీడియో అనే చిత్రంలో నటించింది.
ఇటీవలే నటి మల్లికా షెరావత్ గతంలో ఓ సౌత్ డైరెక్టర్ తో జరిగిన అనుభవం గురించి వెల్లడించింది. గతంలో ఓ సౌత్ డైరెక్టర్ తన సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం తనవద్దకి వచ్చాడట. అయితే ఈ స్పెషల్ సాంగ్ చాలా బొల్డ్ గా ఉంటుందని అయినప్పటికీ తాను నటిస్తానని చెప్పిందట.
ఈ క్రమంలో తనని స్పెషల్ సాంగ్ లో ఎళా చూపించబోతున్నారని డైరెక్టర్ ని అడిగితే ఆ డైరెక్టర్ ఏకంగా తన నడుముపై చపాతీలు వేడిచేస్తానని చెప్పడంతో ఒక్కసారిగా ఖంగు తిన్నట్లు మల్లికా షెరావత్ తెలిపింది. అలాగే ఈ విషయం విన్న తర్వాత ఆ డైరెక్టర్ స్పెషల్ సాంగ్ ని రిజెక్ట్ చేశానని చెప్పుకొచ్చింది. ఇలాంటి చేదు సంఘటనలు తన కెరీర్ లో చాలానే చూశానని దాంతో ఇటువంటి విషయాలని పెద్దగా పట్టించుకోనని తెలిపింది.
ఈ విషయం ఇలా ఉండగా విక్కీ విద్యా క వో వాలా వీడియో చిత్రం అక్టోబర్ 11మన థియేటర్లలో రిలీజ్ అయ్యింది. కానీ ఈ చిత్రం ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. ఈ క్రమంలో కేవలం రూ.16.57 కోట్లు కలెక్ట్ చేసింది. అయితే ఈ కినిమా మొత్తం బడ్జెట్ రూ.17 కోట్లు మించి లేకపోవడంతో దర్శకనిర్మాతలు నష్టాలనుంచి బయటపడ్డారు.