బయట పిండి గిర్నీ.. లోపల  బాంబులు తయారీ ఫ్యాక్టరీ.. ఢిల్లీ పేలుడు ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి 

బయట పిండి గిర్నీ.. లోపల  బాంబులు తయారీ ఫ్యాక్టరీ.. ఢిల్లీ పేలుడు ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి 

ఢిల్లీ ఎర్రకోట పేలుడు ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నారు. ఉగ్రవాదులు భారీ ఎత్తున పేలుళ్లకు స్కెచ్​ వేసినట్లు సాక్ష్యాలు ఒక్కొక్కటిగా  బయటపడుతున్నాయి. పట్టుబడ్డ ఉగ్రవాది ముజమ్మిల్​ ఏకంగా తాను నివాసం ఉంటున్న ఇంట్లోనే బాంబుల తయరీని ఫ్యాక్టరీని తెరిచినట్లు దర్యాప్తు అధికారుల విచారణలో  తెలిసింది. 

ఢిల్లీ కారు బాంబు పేలుడుకు ముందు అరెస్టయిన డాక్టర్​ ముజమ్మిల్​ నివసిస్తున్న ఇల్లును పరిశీలించగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముజమ్మిల్​ పిండి గిర్నీనే బాంబుల తయారీ ఫ్యాక్టరీగా మార్చాడు. హర్యానాలోని పరీదాబాద్​ లోని ఓ ట్యాక్సీ డ్రైవర్​ ఇంట్లో స్వాధీనం చేసుకున్ పిండి మిల్లు, విద్యుత్​ యంత్రాలు లభ్యమయ్యాయి. వీటితోనే బాంబులు తయారుచేస్తున్నట్లు పోలీసులు ప్రాథమిక నిర్దారణకు వచ్చినట్లు తెలుస్తోంది. 

సాధారణంగా పిండి గిర్నీని  పప్పు ధాన్యాలను, మసాలాలు గ్రైండ్​ చేసుకునేందుకు వినియోగిస్తారు. అయితే ముజమ్మిల్​ అద్దెకు తీసుకొని ఉంటున్న ఇంట్లో ఏకంగా బాంబులను తయారీ చేసేందుకు ఈ పిండి గిర్నీని ఉపయోగించవచ్చు. వీటిలో పెద్ద పెద్ద రోలర్లు, బ్లేడ్​ లు ఉన్నాయి. 

ముజమ్మిల్​ నెలకు రూ. 15వందలకి రూం రెంట్ తీసుకొని ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ముజమ్మిల్​ రూంలో 2600 కిలోల అమ్మోనియం నేట్రేట్​ నిల్వ ఉన్నట్లు చూపించే వీడియో మరోసారి బయటికొచ్చింది. ఈ సీక్రెట్​ ప్లేస్​ ఉగ్రవాద మాడ్యూల్‌లో కీలక భాగం అని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు.

దేశవ్యాప్తంగా పేలుళ్లకు ముజమ్మిల్​ అద్దెకు తీసుకున్న రూం నుంచే ప్లాన్​ వేసినట్టు దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. రెండేళ్లుగా ముజమ్మిల్​ ఇంటినుంచే ఉగ్ర కుట్రలు జరిగినట్లు తేలింది. పేలుడు లో ఉపయోగించిన కారు, ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఉమర్​ నబీ  ఇంట్లో సోదాలతో స్వాధీనం చేసుకున్న ఆధారాలతో  దేశవ్యాప్త పేలుళ్లకు పక్కా ప్రణాళికలు వేసినట్లు తెలుస్తోంది. 

డైరీలు, నోట్​ బుక్​ లలో కోడెడ్​ రిఫరెన్స్​లు , నంబర్లు, ఆపరేషన్​గురించి పదే పదే ప్రస్తావనలు ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. డైరీలలో 2530 మంది పేర్లను గుర్తించారు. వీరిలో ఎక్కువ మంది జమ్మూ కాశ్మీర్​, ముజమ్మిల్​, ఉమర్​ స్వస్థలం ఫరీదాబాద్​,సమీప ప్రాంతాలకు చెందినవారు ఉన్నారు. వీరంతా వైట్ కాలర్​ ఉగ్రవాదంలో భాగస్వాములు అయి ఉండొచ్చని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. ఉగ్రకుట్రలో ఎన్ ఐఏ విచారణ కొనసాగుతోంది.